Praja Kshetram
తెలంగాణ

ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు

ఆర్థిక సహాయం కోసం ఎదురుచూపులు

 

చేవెళ్ల జనవరి 19(ప్రజాక్షేత్రం):రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలోని కమ్మెట గ్రామానికి చెందినటువంటి గొల్లగూడ యాదయ్య తండ్రి హనుమయ్య వయసు 50 సంవత్సరాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం కోసం తన యావదాస్తిని తాకట్టు పెట్టి చూయించుకున్న పూర్తిగా కోలుకోలేకపోవడంతో దాతల ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే కమ్మెట గ్రామానికి చెందినటువంటి గొల్లగూడ యాదయ్య 2023 మార్చ్ 19వ తేదీన హిమాయత్ నగర్ నుండి కమ్మెట కు బైక్ పై వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికులు అతడిని హాస్పిటల్ కి తరలించగా కోమాలోకి వెళ్లినట్టు, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయినట్టు డాక్టర్లు తెలిపారు. జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్లో బ్రెయిన్ సర్జరీ చేయడం జరిగింది. కుడి చేయి కుడికాలు పక్షవాతానికి గురి కావడం తో తీవ్ర మనోవేదన కు గురయ్యారు.హాస్పిటల్ ఖర్చులకై వైద్యం కొరకు తనకు ఉన్న అరఎరం పొలం పూర్తిగా అమ్మి ట్రీట్మెంట్ తీసుకున్నారు. దాదాపు నాలుగు నెలలపాటు హాస్పిటల్లో గడిపి ఇంటికి చేరుకొని ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. తాను మాట్లాడలేరు,తన పని తాను చేసుకోలేడు, ఇలా గత రెండు సంవత్సరాలుగా నరకయాతన అనుభవిస్తున్నారు. కుటుంబం గడవడమే కష్టంగా మారి ఏదైనా పని చేసుకుందామని తన భార్య అనుకున్న తన భార్య కు నాలుగు ఆపరేషన్స్ కావడం వల్ల తనకు ఆరోగ్యం సహకరించడం లేదు ఒకవైపు భర్త మంచాన పడటం తో కుటుంబ భారం ఇబ్బంది గా మారి తన బిడ్డల చదువు ఆగమై అన్ని తానే చూసుకుంటుంది..ఎలాగైనా దాతలు ఆర్థిక సహాయం చేసి తన భర్త ప్రాణాలు కాపడాలని కోరుతున్నారు.

Account details :

A/C no- 141512010001553

IFSC CODE – UBIN0814156

BRANCH- CHEVELLA

BANK NAME – UNION BANK OF ఇండియా

ఫోన్ నంబర్ : +91 93905 62808

Related posts