Praja Kshetram
తెలంగాణ

అనర్హులకు జారీ చేసిన పట్టాపాసు పుస్తకాలు రద్దు చేయాలి : ఎంపీ రఘునందన్ రావు

అనర్హులకు జారీ చేసిన పట్టాపాసు పుస్తకాలు రద్దు చేయాలి : ఎంపీ రఘునందన్ రావు

 

సంగారెడ్డి జనవరి 21(ప్రజాక్షేత్రం): రామచంద్రాపురం మండలం వెలిమల రెవెన్యూ గ్రామ పరిధిలోని 85 ఎకరాల గ్యాఫ్ ల్యాండ్. బిల్లాదాఖల భూములలో అనర్హులకు జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలు రద్దు చేయాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. సోమవారం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంపై బ్లాక్ షర్ట్ ధరించి వచ్చిన ఎంపీ రఘునందన్ రావు కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వెలిమెల గ్రామ పరిధిలోని బిల్లాదాఖల భూమిలో 80 గిరిజన కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. సాగు చేసుకుంటున్న ఈ భూముల కోసం గిరిజన రైతులు 1994లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా హైకోర్డు గిరిజన రైతులకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చిందన్నారు.కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు సమర్పించిన వారి నుంచి ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. దశాబ్దాల కాలంగా ఈ బిల్లాదాఖల భూములలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులను కాకుండా స్థానికేతర భూస్వాములకు గత సంవత్సరం డిసెంబర్ 21, 2024న సర్వే నెంబర్ 632 నుంచి 643 వరకు నూతన సర్వేనంబర్లు వేసి అక్రమ పట్టా పాస్ పుస్తకాలు జారీ చేశారని ఆరోపించారు. అర్హులైన వారికి కాకుండా చట్టవిరుద్ధంగా జారీ చేయబడిన అక్రమ పట్టాపాసు పుస్తకాలను రద్దు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్నారన్నారు. ఈ విషయాలు స్థానిక పార్లమెంట్ సభ్యునిగా నాకు తెలియగా వెలిమెల రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 632 నుంచి 643 వరకు గల సర్వేనంబర్లలో అక్రమంగా చట్టవిరుద్దంగా అనర్హులకు జారీ చేసిన పట్టాపాసు పుస్తకాలు రద్దు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు.

Related posts