శంకర్ పల్లిని కప్పేసిన మంచు దుప్పటి
శంకర్‌పల్లి జనవరి 25(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి పట్టణాన్ని శనివారం ఉదయం మంచు దుప్పటి కప్పేసింది. ఇప్పటి వరకు కూడా పొగ మంచు వీడలేదు. రోడ్లపై మంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనాలకు హెడ్ లైట్లు వేసుకొని నెమ్మదిగా మూవ్ అవుతున్నారు. పొగ మంచు ప్రభావంతో జనం బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆహ్లాద వాతావరణంతో పుర ప్రజలు సేద తీరారు.