Praja Kshetram
తెలంగాణ

ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతరు-పొలంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లు

ఎమ్మెల్యే ఆదేశాలు బేఖాతర్.

-పొలంలో వేలాడుతున్న విద్యుత్ వైర్లు

-నిర్లక్ష్యం వైఖరి వీడని పెద్దేముల్ ఏఈ

-రైతుల పట్ల శాపంగా మారిన ఏఈ రఘువీర్

-ఆందోళన చెందుతున్న రైతులు

-రైతుల పట్ల ఇంత నిర్లక్ష్యం తగదని పలువురు రైతులు అసంతృప్తి చేస్తున్నారు.

పెద్దేముల్ జనవరి 25(ప్రజాక్షేత్రం):పెద్దేముల్ మండల కేంద్రంలోని రైతుల పట్ల శాపంగా మారిన విద్యుత్ ఏఈ రఘువీర్. తమ పొలంలో విద్యుత్ వైర్లు చేతికందే ఎత్తులో ఉన్నాయి, అక్కడ ప్రమాదం పొంచి ఉంది విద్యుత్ వైర్లు పైకి కట్టండి అని రైతు పలుమార్లు విన్నవించుకున్న తన మొండిపట్టు వీడడం లేదు. సమస్య ఉంది అని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే ఆదేశాలను లెక్కచేయడం లేదు. ఎప్పుడు ఏ క్షణాన వైర్లు తలకు తాకి ఏం ప్రమాదం జరుగుతుందోనని రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఏ క్షణాన ఇలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే పెద్దేముల్ ఏఈ రఘువీర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని రైతు శ్రీనివాస్ డిమాండ్ చేస్తున్నాడు.

Related posts