Praja Kshetram
తెలంగాణ

లక్ష డప్పులు వేల గొంతుల మహా ప్రదర్శనను విజయవంతం చేద్దాం

లక్ష డప్పులు వేల గొంతుల మహా ప్రదర్శనను విజయవంతం చేద్దాం

 

-ఫిబ్రవరి 7న చలో హైదరబాద్ పిలుపునకు సన్నద్ధమవుతున్న మాదిగ మహా సైన్యం

-కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ

ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు

మొయినాబాద్, జనవరి 27(ప్రజాక్షేత్రం):మూడు దశబ్దాల సుదీర్ఘ పోరాట ఫలితం, ఎస్సీ వర్గీకరణకు సర్వత్రా ఆమోదం, అంతిమ దశలో అయినవారితోనే అడ్డంకులు ఇంకె న్నాళ్లు ఈ దాష్టీకం. గుప్పెడు జనం వ్యతిరేకిస్తే దోషడు జనం నష్టపోవాలా..? పని మనది పెత్తనం వారిదా..? ఇంకెన్నాళ్ళు ఈ తెలియని తత్త్వం, లక్ష డప్పులు ఒక్కటిగా చేసే వర్గీకరణ ధ్వని దేశమంతా ప్రతిధ్వనించేలా చాటి చెప్పాలని మా అదిగులంతా ఏకమై మహారధులుగా కదం తొక్కలని పిలుపునిచ్చారు. మొయినాబాద్ మాదిగ సోదరులు. మన నాయకుడు మందకృష్ణ పోరాటం దేశం ఎల్లలు తాకింది. అణగారిన మన జాతి హక్కులకై తన జీవితం అంకితం చేస్తున్న మన నాయకుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీని ఇచ్చి గౌరవించుకుందని, ఇంతటి మహానేత మాదిగల హక్కుల ఉద్యమ కారుడు మందకృష్ణ మాదిగ మొదలు పెట్టిన ఈ పోరాటాన్ని కాపాడుకోవడం, లక్ష్య సాధనలో అంతిమంగా ఎస్సీ వర్గీకరణ సాధించడం ఎంతో దూరంలో లేదు అని ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగళ్ళ ప్రవీణ్ కుమార్ మాదిగ పేర్కొన్నారు. మొయినాబాద్ ఎమ్మార్పిఎస్ నాయకులు రాజకీయాలకు అతీతంగా వర్గీకరనే ద్యేయంగా ఒక్కటై గర్జించారు. మొయినాబాద్ మండల పరిధిలో ని కంజర్ల ప్రకాష్ ఫంక్షన్ హల్ లో సమావేశమయ్యారు. మాదిగ మహాజనులంతా మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు వేలాదిగా తరలివెళ్లాలని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువు రు మాదిగ సహోదరులు మాట్లాడుతూ.. మందక్రిష్ణ మాదిగ సుదీర్ఘపోరాట ఫళితం.. కంచంలో పెట్టుకున్న తరువాత తినేకూటిలో మట్టిజల్లుతున్న మాలల్లో వర్గీకరణ వ్యతిరేకుల చెంప చెల్లుమనేలా ఫిబ్రవరి 7న లక్షడప్పులు, వేయి గొంతులతో హైద్రాబాద్లో మహప్రదర్శనలో మాదిగలు, ఉపకులాలు అంబేద్కర్ రాజ్యాంగంలో ఫలాలు దళితుల్లో అన్ని కులాలకు సమాన వాటాకు మద్దతు తెలిపే అన్ని వర్గాలు వేల సంఖ్యలో తరలి రావాలని అన్నారు. జిల్లా నాయకులు కాడిగళ్ళ ప్రవీణ్, మండల నాయకులు ఆధ్వర్యంలో ఏర్పటైన ఈ సమావేశంలో.. మండల ఎమార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం విజయవంతంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో దళితు లకు ఉమ్మడిగా ఉన్న రిజర్వేషన్లలో దళితుల్లో అన్ని ఉప కులాల కు సమన్యాయం దక్కలేదంటు ఎవరి వాటా వారికి దక్కాలని దండోర పోరాటాలతో దళితుల్లో ఎబిసిడి వర్గీకరణను సాధిస్తే, దళితుల్లో ఉన్నత వర్గమైన కేవలం మాలల్లో కొంత మంది. ఆనాడు సుప్రీంకోర్టులో రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం లేదంటు రద్దుచేయించారు, నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కోంటు వర్గీకరణ కోసం దేశ వ్యాప్తంగా ఏకతాటిపైకి వచ్చి ఇప్పుడు సుప్రీంకోర్టు ఉన్నత ధర్మసానం వర్గీకరణ రాష్ట్రా లకు చేసుకోవచ్చని తీర్పును ఇస్తే ప్రభుత్వాలు వర్గీకరణ చేయడా నికి సిద్ధంగా ఉంటే.. తిరిగి అడ్డుపడుతు మాదిగల నోటి కాడికూ డును కాళ్లతో తన్నుతున్నారని, వర్గీకరణ మాదిగలు సాధించుకోవ దానికి ఫిబ్రవరి 7న మాదిగలు, ఉపకులాలు, వర్గీకరణకు మద్ద తు తెలిపే అన్ని కులాలు వేల సంఖ్యలో తరలి రావాలని పిలుపుని చ్చారు. ఈ కార్యాక్రమంలో ఎం ఎస్ పి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ క్యాసారం శంకర్ రావు, జిల్లా అంబేద్కర్ సంఘం మాజి అధ్యక్షులు ఉప్పరి శ్రీను, మహేందర్, లక్ష్మయ్య, చిల్కూర్ ప్రేమ్కుమార్, దేవ్కుమార్, జి దర్శన్, కె. బాస్కర్, ప్రదీప్, బి.జెకరయ్య, హిమాయత్ నగర్ శాబాద్ దర్శన్, సునీల్, ఎన్కెపల్లి గ్రామ ప్రభుచరణ్, ప్రశాంత్, పవన్, చెందు, మహేష్, అమ్లాపుర్ సునీల్, కనకమామిడి రవి, గణేష్, హరీ, సందీప్, నెమిలిగారి రవి, దయాకర్, రమాగళ్ళ రాజు, చంద్రశేఖర్, కర్రోళ్ళ శ్రీధర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts