ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాకు అదనపు బాధ్యతలు
అమరావతి జనవరి 30(ప్రజాక్షేత్రం):ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న ద్వారకా తిరుమలరావు స్థానంలో ఆయనను ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న హరీష్ కుమార్ గుప్తాకు డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పటి డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని తప్పించి హరీశ్ కుమార్ గుప్తాను ఎంపిక చేసింది. దీంతో ఆయన కొన్నిరోజుల పాటు డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు.