మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
రాజేంద్రనగర్, జనవరి 30(ప్రజాక్షేత్రం):రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, మహాత్మా గాంధీ కి ఘనంగా నివాళులు అర్పించారు.సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తాను అని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 420 హామీల లో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చకుండ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని తీవ్రంగా మండిపడ్డారు.బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నాడు మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలోకాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నీ కూడా అమలు చేసే వరకి ప్రభుత్వాన్ని ఇలా నిలదీస్తూనే ఉంటాం అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిసిసిబి డైరెక్టర్, మల్కారం పిఎసిఎస్ చైర్మన్ బుర్కుంటా సతీష్, మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల మోహన్, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మంచర్ల శ్రీనివాస్, ఆర్.బి నగర్ కౌన్సిలర్ కొనమోల్ల శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు దీప మల్లేష్, శంషాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ బుచ్చి రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు గౌస్ బాయ్, శంషాబాద్ బిఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, చిన్న గండు రాజేందర్,హనుమంతు, భాస్కర్ పరంధాములు వివిధ గ్రామాల నుంచి మాజీ సర్పంచులు వార్డ్ నెంబర్లు ఎంపీటీసీల వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.