పంచాయతీ అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు
-మునిదేవుని పల్లి సర్వేనెంబర్ 60లో అక్రమ నిర్మాణాలు.
కొండాపూర్ జనవరి 28(ప్రజాక్షేత్రం):మండల పరిధిలోని మునిదేవుని పల్లి గ్రామ సర్వేనెంబర్ 60లో ఎలాంటి అనుమతులు లేకుండా హైదరాబాద్ కు చెందిన బడా రియాల్టర్ ఆనంద్ కుమార్ రెడ్డి తన వ్యవసాయ పొలంలో నాలా కన్వర్షన్ లేకుండా బిల్డింగ్ నిర్మాణాల కొరకు పునాది పనులు కొనసాగుతున్నాయి. ఓవైపు జిల్లాస్థాయి అధికారులు అక్రమాలకు పాల్పడం వారిపై చర్యలు తీసుకోమన్న గ్రామ సంబంధిత పంచాయతీ సెక్రెటరీ వారిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో తెలియని పరిస్థితి నెలకొంది. రెవెన్యూ కార్యాలయంలో దాదాపు 20 రోజుల నుండి సర్వేనెంబర్ పై ఓవైపు రైతులు రియాక్టర్ల మధ్యల గొడవలు జరుగుతున్న నాకేం సంబంధం లేదన్నట్టుగా పంచాయతీ సెక్రెటరీ అక్రమ నిర్మాణాలను ఎందుకు ఆపడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై తగు చర్యలు తీసుకోవాలన్నారు లేని పక్షంలో జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
-పంచాయతీ సెక్రెటరీ వివరణ కొరకు ఫోన్ చేయగ ఫోన్ ఎత్తని పరిస్థితి.