తీరిన విద్యుత్ తీగల సమస్య
-హర్షం వ్యక్తం చేసిన రైతు
పెద్దేముల్ జనవరి 30(ప్రజాక్షేత్రం):ప్రజాక్షేత్రం దినపత్రికలో ఈనెల 22న “పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలు” అనే శీర్షికతో ప్రచురించిన కథనానికి విద్యుత్ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించారు. చేతికి అందే ఎత్తులో విద్యుత్ తీగలు పొలంలో వేలాడుతుండటంతో, ఏ క్షణం ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని రైతులు ఆందోళన చెందారు. అయితే రైతు తెలిపిన వివరన మేరకు ప్రజాక్షేత్రం దినపత్రికలో వార్తను ప్రచురించాము. దీంతో అధికారులు స్పందించి విద్యుత్ తీగలను పైకి కట్టడమే కాక రెండు కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సమస్య తీరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.