Praja Kshetram
తెలంగాణ

అక్రమ నిర్మాణం నేలమట్టం చేసిన పంచాయతీ అధికారులు.

అక్రమ నిర్మాణం నేలమట్టం చేసిన పంచాయతీ అధికారులు.

 

-ప్రజాక్షేత్రం వరుస కథనాలకు స్పందించిన డిఎల్పిఓ అనిత.

-మండలంలో అక్రమాలకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తి లేదు.

కొండాపూర్ జనవరి 30(ప్రజాక్షేత్రం):అక్రమ నిర్మాణాలపై స్పందించని పంచాయతీ అధికారులు అనే శీర్షిక ప్రజాక్షేత్రం వరుస కథనాలపై మంగళవారం మధ్యాహ్నం జిల్లా అధికారి డి ఎల్ పి ఓ అనిత తోపాటు మండల ఎంపీ ఓ శ్రీనివాస్ గ్రామ పంచాయతీ సెక్రెటరీ నవీన్ లు కలిసి మంగళవారం మధ్యాహ్నం శ్రీ రిధి హాబీట్రేడ్స్ ఎల్.ఎల్.పి రఘునాథ్ డెవలపర్స్ లో అక్రమ నిర్మాణ పనులు ప్రహరి గోడ,ఆర్చ్ నిర్మాణం పనులు కొనసాగుతుండగా నోటీసులు ఇచ్చిన వినకుండా నిర్లక్ష్యం వహించిన మనసాన్పల్లి గ్రామ సర్వేనెంబర్ 196,194,16, లో జిల్లా అధికారులతో పాటు మండల అధికారులు ఉక్కు పాదం మోపి అక్రమ నిర్మాణాలు జెసిబి సహాయంతో కూల్చివేశారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ అనిత మాట్లాడుతూ మండలంలో గ్రామ మండల పంచాయతీ అధికారుల అనుమతులు లేకుండా ఏలాంటి నిర్మాణాలు చేపట్టిన తగు చెడ్డపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Related posts