మాదిగలకు రిజర్వేషన్లు 11 శాతం రావాల్సిందే
-వర్గీకరణ మందకృష్ణ మాదిగతోనే సాధ్యం
-వందల డప్పులతో రోడ్డెక్కిన శంకర్ పల్లి మాదిగ యువకులు
-కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ
ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు
-బండ్లగూడెం శ్రీనివాస్ మాదిగ ఎమ్మార్పీఎస్ శంకర్ పల్లి అధ్యక్షులు
శంకర్ పల్లి, ఫిబ్రవరి 07(ప్రజాక్షేత్రం):30 యేళ్ల వర్గీకరణ పోరాటంలో ఎమార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఎన్నో ఆటుపోట్లకు ఎదురొడ్డి ముక్తకంఠంతో వర్గీకరణ సుసాధ్యం చేశారు. మందకృష్ణ మాదిగ పోరాటంతోనే మాదిగలకు, మాదిగ ఉప కులాలకు, మాల ఉప కులాలకు రిజర్వేషన్లు వచ్చాయని.. సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాష్ట్రాలు అమలు చేసుకోవాలని తెలిపిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 30 యేళ్ల వర్గీకరణ పోరాటం గుర్తుంది. కాని మాదిగల చిరకాల ఆంకాంక్షను నేరవేర్చిన మంద కృష్ణ పేరును కూడ అసెంబ్లీలో ముఖ్యమంత్రి పలకపోవడం పట్ల మాదిగలు, మాదిగ ఉపకులాలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నామని, శంకర్ పల్లి మండల అధ్యక్షులు బండ్లగూడెం శ్రీనివాస్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేల గొంతులు, లక్ష డప్పుల కార్యాక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదిగలకు జనాభా ప్రాతిపదిక వాటా పంచినా, వెనక బడిన జాతుల ప్రకారమైనా మాదిగలకు 11 శాతం రిజర్వేషన్ రావాలన్నారు. పంపకాలలో మాదిగలకు అన్యాయం జరిగితే ఇంతకన్నా పెద్ద ఎత్తున ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి మాదిగలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎవరివాటా వారికి పంపకం చాతకాలేదా ఈ ముఖ్యమంత్రికి లేదా మాలల వత్తిడికి తలొగ్గి మాదిగలకు కేవలం 9 శాతం రిజర్వేషన్ ఇచ్చారా అంటు ప్రశ్నించారు. దాదాపు 300 వందల డప్పులతో వందల సంఖ్యలో మాదిగలు చౌరస్తాపైకి వచ్చి డప్పులను కొడుతుంటే చౌరస్తా మారుమోగింది, మాదిగల డప్పుల విన్యాసాలు, ఆట పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. మాట్లాడుతూ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వంపకాలలో మాదిగలకు అన్యాయం జరిగిందనడానికి లేదని, ఇంకా వేల గొంతులు, లక్ష డప్పుల కార్యాక్రమానికి ఇంకా పెద్ద ఎత్తున డప్పులను పెంచాలని మండలంలోని గ్రామాల ఎమార్పీఎస్ అధ్యక్షులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధి శ్రీనివాస్ మాదిగ, కోశాధికారి తొంట నర్సింహ, ప్రచార కార్యదర్శి ప్రశాంత్ మాదిగ, శేఖర్, సంపత్, సత్తిష్ చంద్ర, సాయి గణేష్, భాను ప్రసాద్, కిరణ్ కుమార్, రమేష్, వెంకట్, మాజీ ఎంపిటిసి రామచందర్, లక్ష్మయ్య, సింగర్ సంజీవ, రామచందర్, రాజ్ కుమార్, క్రిష్ణ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.