Praja Kshetram
తెలంగాణ

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంద కృష్ణ మాదిగ

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంద కృష్ణ మాదిగ

 

ప్రజాక్షేత్రం వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ భేటీఅయ్యారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలులో భాగంగా విద్య, ఉద్యోగాలలో 3 గ్రూపులుగా వర్గీకరించబడిన ఎస్సీ ఉప కులాల రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన నివేదికపై వారు కీలక చర్చలు చేపట్టారు. నివేదికప మంద కృష్ణ తన అభ్యంతరాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. ఎస్సీ రిజర్వేషన్ కు అనుకూలంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సానుకూలంగా ఉన్నామని.. అయితే జస్టీస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాల వల్ల మాదిగలు, మరికొన్ని ఉపకులాల హక్కులు, వాటా, అస్తిత్వం, భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని మంద కృష్ణ తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి ముందు పలు సూచనలు, ప్రతిపాదనలు పెట్టారు. వాటిపై ఈ భేటీలో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు కే.కేశవరావు, సీఎం సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సహా పలు దళిత సంఘాల ప్రతినిధులు ఉన్నారు.

Related posts