Praja Kshetram
తెలంగాణ

గట్టుకాడిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

గట్టుకాడిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి.

 

-పట్టు వస్త్రాలతో ఆశీర్వదించిన అర్చకులు.

వనపర్తి ఫిబ్రవరి 11(ప్రజాక్షేత్రం):ఖిల్లా గణపురం మండలంలోని గట్టుకాడిపల్లి వెంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దర్శించుకున్నారు. భక్తుల కొంగు బంగారం గా దీవించే శ్రీ వేంకటేశ్వర స్వామికి ఆయన నమ్మిన భక్తుడు. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనం పలికి పట్టు వస్త్రాలతో ఆశీర్వదించారు. అనంతరం మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని మున్ముందు కూడా మరింత అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాళ్ల కృష్ణయ్య, సామ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts