సంగారెడ్డి బి ఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు 32 కోట్ల రూపాయలు మంజూరు
సంగారెడ్డి ఫిబ్రవరి 11(ప్రజాక్షేత్రం):సంగారెడ్డి బి ఆర్ అంబేద్కర్ స్టేడియం అభివృద్ధి కొరకు 32 కోట్ల రూపాయలు మంజూరు చేయించాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి గారికి తెలిపిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మరియు TGIIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు స్టేడియం కు సంబంధించిన ప్రతిపాదనలు అందచేయడం జరిగింది అందులో ఇండోర్ స్టేడియంలో బాస్కెట్ బాల్ ,కబ్బడ్డి,షటిల్, చెస్,హ్యాండ్ బాల్,వాలీ బాల్, జిమ్,మరియు ఔట్ డోర్ లో సింథటిక్ 800 మీటర్స్ రన్నింగ్ ట్రాక్,ఫూట్ బాల్,హాకీ,ఖో ఖో,బాక్స్ క్రికెట్ అన్ని క్రీడలను అభివృద్ధి చేయుటకు గాను సుమారు 32 కోట్ల రూపాయల ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంధాలయా చైర్మన్ తోపాజి అనంత్ కిషన్ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ రామచందర్ నాయక్ కంది మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోతి లాల్,యూత్ కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.