వికారాబాద్ మెడిక్యూర్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలి
– మల్టీ స్పెషాలిటీ పేరుతో కొనసాగుతున్న వికారాబాద్ మెడిక్యూర్
– కనీస సౌకర్యాలు లేని హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకోవాలని డి ఎం హెచ్ ఓ కు వినతిపత్రం
– ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు
చేవెళ్ల, ఫిబ్రవరి 11(ప్రజాక్షేత్రం):ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై మహేందర్, బి మల్లేష్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో కార్పొరేట్ పేరుతో రోజుకొక హాస్పిటల్ దర్శనమిస్తూ కనీస సౌకర్యాలు కూడా లేకుండా మల్టీ స్పెషాలిటీ పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు. అత్యవసరం పరిస్థితిలో హాస్పిటల్స్ ముందు వాహనాలు నిలపడానికి కనీసం పార్కింగ్ సౌకర్యం కూడా లేకుండానే అనుమతులు పొందుతున్నారు ఒక ల్యాబ్ లో నిర్వహించిన పరీక్ష రిపోర్టులు మరొక హాస్పిటల్లో చెల్లవు మళ్లీ వాళ్ల వద్ద టెస్టులు చేయించుకోవాలి అడిగినంత ఫీజు ఇవ్వాలి మందులు కూడా అక్కడే కొనాలి హాస్పిటల్ పర్మిషన్ ఒక డాక్టర్ పేరు మీద ఉంటే మరో డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు అవసరం ఉన్నా లేకపోయినా రకరకాల పరీక్షలు చేసి బిల్లులు వేసి ఫీజులు దండుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్ లో పైన చర్య తీసుకోవాలని అన్నారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికూర్ హాస్పటల్ కు కనీసం పార్కింగ్ కూడా లేకపోయినా ఆరోగ్యశ్రీ సేవలు మంజూరు చేయడం విచారకరం అన్నారు. పరిగి సాధన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ హైవే ఫుట్పాత్ పైన ఉంది కనీసం పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో పాటు ప్రాణాలు పోతున్న వైద్య అధికారులు పట్టించుకోకపోవడం లేదు అన్నారు. జిల్లాలో ఈ రకంగా ఫీజులు దండుకుంటున్న హాస్పిటల పైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జి రాములు, యాదయ్య, నర్సింలు పాల్గొన్నారు.