చిలుకూరు బాలాజీ ఆలయ రంగరాజన్ పై దాడి దురదృష్టకరం
– జడ్పీచైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి
– చేవెళ్ల అసెంబ్లీ ఇంచార్జీ పామెన భీమ్ భరత్
మొయినాబాద్ ఫిబ్రవరి 11(ప్రజాక్షేత్రం): మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ను పరామర్శించిన జడ్పీచైర్ పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి తో చేవెళ్ళ అసెంబ్లీ ఇంచార్జీ పామేన భీమ్ భరత్ ఇది అత్యంత దుర్మార్గమైన చర్య.. దాడి చేసిన వారు ఎంతటి వారైనా వదిలేది లేదు కఠినంగా శిక్ష పడేలా చూస్తాం హిందు ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే వ్యక్తి రంగరాజన్ అని అన్నారు. రాముని పేరుతో ఇలాంటి దాడులు చేయడాన్ని ఖండించారు. మరియు వీరితో పాటుగా పాల్గొన్న ఆయా గ్రామ మాజీ సర్పంచ్ భద్రప్ప, బాకారం మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి , మండల సీనియర్ నాయకులు కేబుల్ రాజు, షాబాద్ మండల దామర్ల పల్లీ గ్రామ మాజీ సర్పంచ్ బర్ల యాదయ్య, సీనియర్ నాయకులు శుభాష్, తదితర ఆలయ అర్చకులు, పండితులు నిర్వాహకులు పరిసర గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.