అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న, చేవెళ్ల మండల టౌన్ ప్లాన్ అధికారులు
– అక్రమాలను తొలగించే అధికారులే అమ్ముడుపోతున్నారా?
– చేవెళ్ల మండల పరిధిలో వందకు పైగా అక్రమ లేఅవుట్లు, పట్టించుకోని అధికారులు.
– అవినీతి ఆరోపణలతో నిస్సిగ్గుగా నిస్సహాయ నిద్రావస్తలో జోగుతున్నారు.
– చీకటి దందాకు వెలుగులు నింపుతున్న చేవెళ్ల విద్యుత్ అధికారులు.
– ప్రభుత్వఆదాయానికి అధికారులె అడ్డంకిగా మారారు అని ఆరోపణలు.
– కొంతమంది అవినీతి అధికారుల విధి నిర్వహణతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటున్న పలువురు అధికార నేతలు.
చేవెళ్ల, ఫిబ్రవరి 11(ప్రజాక్షేత్రం):అక్రమ నిర్మా ణాల విషయం లోనూ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఆక్రమ నిర్మాణాలను తనిఖీ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వాల్సిన న్యాక్ ఇంజనీర్లు నామమాత్రంగా విధులు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు అలవాటుపడ్డ కొందరు రియల్ ఎస్టేట్ రాజకీయ నాయకులు గ్రామాల అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా ఇల్లీగల్ లేఔట్ లు వేసి, అమాయక ప్రజలకు ప్లాట్లు అంటగడుతూ జేబులు నింపుకుంటున్నారు. అనుమతులు లేని లేఔట్లకు లేనిది ఉన్నట్టుగా చూపి ప్లాట్ల వినియోగదారులను బోల్తా కొట్టిస్తున్నారు. ఈ మోసపూరిత మహా యజ్ఞానికి పలువురు స్థానిక రాజకీయ ప్రజా ప్రతినిధులు ముందుండి నడిపిస్తున్నారు. అప్పుడు చేసిన అక్రమాలకు ఆనవాయితీగా అలవాటుగా ఇప్పుడు చేపడుతున్న అక్రమ నిర్మాణాలకు నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళితే… రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలపరిధిలో పుట్టగొడుగుల్లా వెలిసిన అక్రమ లేఅవుట్లు కోకోల్లలు. అధికారులంతా ఎన్నికల హడావుడిలో ఉన్నారు. ఇదే అదనుగా మండలంలో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. నిబంధనలకు విరుద్ధమని గతంలో అధికారులు నిలిపివేసిన నిర్మాణాలు తిరిగి ప్రారంభమైపోతున్నాయి. చేవెళ్ల మండలం మల్లారెడ్డి గూడ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 582,583 లో సుమారు 13 ఎకరాలలో ఇమామ్ కన్స్ట్రక్షన్ పేరుతో 2019 లో అక్రమ లేఔట్ నిర్మాణం జరిగింది . ఈ లేఔట్ లో కొన్న ప్లాట్ విస్తీర్ణం సుమారు (10 గుంటలు ) లలో వినియోగదారుడు బిల్డింగ్ అనుమతులు లేకుండా, అక్రమంగా ఇప్పుడు ఫామ్ హౌస్ నిర్మాణాన్ని పూర్తిచేసే పనిలో పడ్డారు. గతంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ, ఈ అక్రమ భవన నిర్మాణాన్ని ఆపాలని నోటీసులు ఇచ్చి, నిర్మాణం పనులు అడ్డుకోవడంతో పనులు నిలిపివేశారు. తాజాగా మళ్లీ పనులు ప్రారంభించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ అక్రమ నిర్మాణ పనులకు కావలసిన విద్యుత్ ను, చేవెళ్ల సబ్ స్టేషన్ అధికారులు, మల్లారెడ్డి గూడ గ్రామ గేటునుండి గ్రామంలోకి వెళ్లే వీధిలైట్ల స్తంభాల నుండి, నేరుగా ఈ వెంచర్ కు కనెక్షన్ ఇవ్వటంతో , ఇంటి నిర్మాణ సమయంలో సీకు కట్టింగ్, ఫిల్లర్ కట్టింగ్ వంటి పెద్ద మిషన్లను వాడటంతో గ్రామంలో లైట్లు వెలగక గ్రామానికి కరెంటు కష్టాలు మొదలయ్యాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మిషన్లు పనిచేస్తున్న సమయంలో కరెంటు లోడ్ సరిపోక మా ఇళ్ళలో లైట్లు రావడం లేదని, మల్లారెడ్డి గూడ గ్రామంలో నాలుగు వెంచర్లకు ఇదే లైను నుండి కరెంటు ఇవ్వటంతో పెద్ద సమస్యగా మారిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని విద్యుత్ చేవెళ్ల సబ్ స్టేషన్ ఎఈ కి పలుమార్లు ఫిర్యాదు చేసిన కనీసం స్పందించని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లారెడ్డి గ్రామ పరిధిలోని పలు వెంచర్లకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని, అందులో నిర్మించే భవన నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు, కనీసం గ్రామపంచాయతీ ఎన్ఓసి కూడా లేదని తెలిపారు. ఈ అక్రమ భవన నిర్మాణాలపై మండల టౌన్ ప్లానింగ్ అధికారులకు (ఎంపీఓ)కు ఫిర్యాదు చేసిన తూతు మంత్ర చర్యలలో భాగంగా, గ్రామ కార్యదర్శికి ఫోన్ చేసి చర్యలు తీసుకోవాలని సూచించారని, స్థానికులు ఫిర్యాదు చేసినా చూస్తామన్నారే తప్ప ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
– మల్లారెడ్డి గూడ గ్రామ సెక్రెటరీ కనుసైలలోని అక్రమ నిర్మాణం
గ్రామ పంచాయతీకి కనుచూపు మేరలో 2 నెలలుగా గ్రామ పంచాయతీ కార్యదర్శి కళ్ళముందు భవన నిర్మాణం పనులు జరుగుతుంటే రోజు నిర్మాణం ముందు నుంచే వెళ్తున్న సెక్రటరీ అటువైపు కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపించారు. అక్రమాలపై పత్రికల్లో కథనాలు వెలువడిన జిల్లా, మండల టౌన్ ప్లానింగ్ అధికారుల నుండి స్పందన లేకపోవడం అధికారుల విధి నిర్వహణపై అవినీతి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక మండల టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించడం లేదన్న స్థానికుల ఆరోపణలపై డి ఎల్ పి వో కు ఫోన్లో ఫిర్యాదు చేయటంతో, వారి ఆదేశాలతో కదిలిన ఎంపీవో తూతు మంత్రంగా గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఫోన్ చేసి అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయలని ఆదేశించారు. నిర్మాణాన్ని నిలిపివేయాలని కార్యదర్శి చెప్పినప్పటికీ, భవన యజమాని ఖాతరు చేయకుండా, సాక్షాత్తు కార్యదర్శి కళ్ళముందే యతేచ్చగా అక్రమ నిర్మాణ పనులు చేపట్టడం వెనుక స్థానిక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జిల్లా, మండల అధికారులు అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. సాధారణ విధులపై దృష్టిసారించే అవకాశం లేకుండాపోయింది. ఇదే అదనుగా భావించిన భవన నిర్మాణదారులు, గతంలో నిలిపివేసిన అక్రమ భవనం నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేలోపు భవన నిర్మాణాన్ని పూర్తిచేసే లక్ష్యంతో శరవేగంగా పనులు చేపడుతున్నారు. దీనిపై స్థానికులు జిల్లా పంచాయతీ అధికారికి, మండల టౌన్ ప్లానింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. ఈ లేఅవుట్ చేసింది స్థానిక ప్రజా ప్రతినిధి కావటంతోనే అధికారులు వారికి సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై డి ఎల్ పి వో ను వివరణ కోరగా ఎన్నికల బిజీలో ఉన్నామని, ఇప్పుడు ఏం చేయాలని సమాధానం ఇచ్చారు. అక్రమాలకు ఊతమిస్తున్న అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. గ్రామంలో ఇంత అక్రమ నిర్మాణాలు జరుగుతున్న మండల టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించడం లేదని, దీనిపై నేరుగా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు.
మా గ్రామం గోడు ఎవరికి చెప్పుకోవాలి
– మహేందర్ మల్లారెడ్డి గూడ గ్రామం
మా గ్రామంలో అక్రమంగా నిర్మానిస్తున్న ఫామ్ హౌస్ ను ఎవరు ఆపగలరు. ఆపాల్సిన అధికారులే కనుమరుగైపోయారు. ఎన్నిసార్లు ఫోన్ చేసిన ఫిర్యాదు చేద్దామని ఎంపీఓ ఆఫీస్ కు వచ్చిన అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎంపీ ఓ గారికి ఫోన్ ద్వారా తెలుపగా మా గ్రామంలో అక్రమ నిర్మాణాలను ఇంకెప్పుడూ ఆపుతారు మా ఇండ్లలో ఇబ్బందికరమైన సమస్యలు వస్తున్నాయి. మా ఇండ్లలో అసలు కరెంటు ఉండడం లేదు అక్కడ పని జరుగుతున్నప్పుడు. అధికారులు ఎలక్షన్ బిజీలో ఉన్నారని చెబుతున్నారు ఇది నిజమైన అని మహేందర్ ప్రశ్నిస్తున్నారు? అధికారులు ఏదైనా మామూలు తీసుకున్నారా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు? అధికారుల కనుసైగలోనే జరుగుతుందని మల్లారెడ్డి గూడెం గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.
అధికారులు ఫామ్ హౌస్ పై చర్య తీసుకోకపోతే కలెక్టర్ ని ఆశ్రయిస్తాము
– వెంకట్ రెడ్డి మల్లారెడ్డి గ్రామం.
అసలు మా గ్రామంలో పక్కన మన నిర్మాణం చేస్తున్నటువంటి ఫామ్ హౌస్ కి ఎటువంటి అనుమతులు ఉన్నాయి మాకు చూపించండి. మా ఊరికి సెక్రెటరీ వారికి నోటీసులు జారీ చేశారని తెలిపారు కానీ అక్కడ ఎక్కడా నోటీసు లేదు గ్రామపంచాయతీలో కూడా ఒక కాపీ ఉండాలి కదా మరి అది ఎక్కడ పోయింది అని సెక్రటరీ నిలదీశారు. మల్లారెడ్డి గూడెం గ్రామం సెక్రెటరీ వచ్చి కూడా పనులను ఆపేయమని చెబితే యధావిధిగా పనులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం అంటే వీరికి భయం లేదా? ప్రభుత్వ అధికారుల కనుసైగలోనే నీ అక్రమాలు జరుగుతున్నాయా. మీరు అక్రమాలు చేసుకుంటే చేసుకోండి కానీ మా ప్రాణాలని బలికలపోద్దని తెలిపారు.