సమత మూర్తి – సంతు రవిదాస్ మహారాజ్
భారతదేశ చరిత్ర గతిని మార్చిన గొప్ప సామాజిక సాంస్కృతిక రాజకీయ విప్లవకారులలో ఒకరు సంతు రవిదాస్ మహారాజ్ ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసి జిల్లాలో గోవర్ధనపురి గ్రామంలో గంగ నది ఒడ్డున ఫిబ్రవరి 12 న 1400 సంవత్సరంలో సంతోష్ దాస్, కల్సిదేవి లకు జన్మించాడు. సంతు రవిదాస్ మహారాజ్ జనన తేదీ పట్ల కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా రవిదాస్ భక్తులైన అనుచరులు ఫిబ్రవరి 12 వ తేదీన జన్మదినంగా జరుపుకోవడం గమనార్షం. రవిదాస్ కి 12 వ ఏటా లోనదేవి తో వివాహం జరిగింది వీరికి విజయ్ దాస్ అనే కుమారుడు. ఆనాటి నుండి నేటి వరకు భారతదేశ చరిత్రలో మనువాదానికి మాదిగల మానవత వాదానికి మధ్య నిరంతరం భావజాల సంఘర్షణ యుద్ధం జరుగుతూనే ఉంది బానిసత్వాన్ని సమర్థించే మనువాదానికి స్వేచ్ఛ సమానత్వం సోదరుభావం కోరుకునే మాదిగ వాదానికి మధ్య సామరసత్య కురదరు. భారతదేశంలో పుట్టిన బౌద్ధాన్ని హింసాత్మక పద్ధతుల ద్వారా సర్వనాశనం చేసి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకి మనువాదులు ప్రాణం పోస్తే, ఈ అసమానతలను రూపుమాపడానికి జీవనదిల ప్రవహిస్తున్న మనువాదానికి అడ్డుకట్ట వేయడానికి గంగా నది ఒడ్డున చెప్పులు కుట్టే చమర్(మాదిగ) కులంలో పుట్టిన గొప్ప సామాజిక సాంస్కృతిక విముక్తి ఉద్యమ నిర్మాతనే సంతు రవిదాస్. మనువాదానికి అడ్డు అదుపు లేకుండా వ్యాపిస్తున్న చోట, కుల, మతాలు లేవు మనుషులందరూ సమానమనే సిద్ధాంతంతో ఒక చమర్(మాదిగ) వ్యక్తి బోధనలు చేయడం మహా విప్లవమే. రవిదాస్ కంటే ముందు ఎందరో సంఘసంస్కర్తలు పనిచేసినప్పటికీ అట్టడుగు స్థాయి ఉండి వచ్చిన రవిదాస్ తీసుకొచ్చిన సిద్ధాంతం విప్లవాత్మకమైనదిగా చెప్పవచ్చు ఎందుకంటే కుల వ్యవస్థ వల్ల ఈ సమాజంలో అత్యధికంగా బాధింప బడుతున్న ఆ సమాజం నుండే ఒక గొప్ప యోధుడు పుట్టడం మామూలు విప్లవంగా భావించకూడదు. బుద్ధుడు చెప్పిన విలువలకి సరి సమానంగా ఉంటాయి సంతు రవిదాస్ బోధనలు. బుద్ధుడు ఆనాడు తన బోధనలతో ఎందరో రాజులను మెప్పించి బుద్ధిజం తీసుకునేలా జ్ఞానబోధ చేస్తే సంతు రవిదాస్ కూడా తన కీర్తనల ద్వారా ఎందరో రాజులని తన మార్గంలో నడిచేలా నూతన సమాధర్మన్ని తీసుకొచ్చాడు. అస్పృశులు జ్ఞానార్జన, జ్ఞాన బోధ చేయడం తప్పని చెప్తుంటే వాటికి వ్యతిరేకంగా మనుషుల మధ్య ప్రేమ కరుణ మానవత్వం సమానత్వం స్వేచ్ఛ సోదర భావాలు ఉండడమే నిజమైన జ్ఞానమని సంతు రవిదాస్ చెప్పడం ఆనాటి మనువాదులకు మింగుడు పడక నాడు కాశీ ని పాలిస్తున్న రాజా నరేష్ జికి మనువాదులు ఫిర్యాదు చేయడం వల్ల రాజా ధర్మం ప్రకారం సంతు రవిదాస్ ని శిక్షించమని రాజు ను ఆజ్ఞాపిస్తారు కానీ సంతు రవిదాస్ తన జ్ఞాన బోధనలతో ఆ రాజుకి జ్ఞానోదయం చేసి తనకి అనుకూలంగా వశరచుకుంటాడు ఇలా ఎందరో రాజులని మెప్పించి సంతు రవిదాస్ నాటి మనువాదులకు ముచ్చమటలు పట్టించాడు అంతేకాకుండా తనకు నచ్చిన మార్గంలో వెళ్తూ తన బోధనలు చెప్పుకునేలా ఎందరో రాజుల ద్వారా సంతు రవిదాస్ అవకాశాల్ని సృష్టించుకున్నాడు. మీరా బాయి , రాణి ఝాలా, రాజా పిపా , రాజా సికందర్ లోధి , గురునానక్ , రాజా బహదూర్ షా, రాణి రతన్ కున్వర్, రాజా నగర్ మాల్, పండిట్ శారదా రామ్, రాజా చందర్ పర్తాప్, బీబీ భన్మతి, పండిట్ గంగా రామ్, రామ్ లాల్, రాజా బైన్ సింగ్, రాణా సంగ , రాజా చంద్రహంస్, గురు కబీర్ , గురు తర్లోచన్, గురు సాధన సెహన్ ప్రముఖ ఎందరో రాజులు రాణులు సంత్ రావిదాస్ బోధనలకు ప్రభావితులయ్యి శిష్యులుగా ఉన్నారు. దేవుడిని అడ్డుగా పెట్టుకొని మనువాదులు తీసుకొచ్చిన అసమానతలకు వ్యతిరేకంగా సంఘపరివర్తన ఒక ప్రాంతానికి సంబంధించిన విషయంగా భావించకుండా దేవుడు నిరాకరుడని భావిస్తూ మనుషులంతా సమానమని చెప్తూ తన సామాజిక సాంస్కృతిక విప్లవాన్ని ఉత్తరప్రదేశ్, ఉత్తరభారతం దాటి దక్షిణ భారతాన్ని కూడా సంతు రవిదాస్ ప్రభావితం చేశాడు. తొలిసారి సంతు రవిదాస్ ఉత్తర భారతాన్ని సందర్శించినప్పుడు కబీరు, త్రిలోచన్, ధన్నాజీలు రవిదాసుతో కలిసి పర్యటించారు. హైదరాబాద్ ప్రాంతాన్ని రవిదాస్ సందర్శించినప్పుడు వారి తత్వాన్ని చమర్(మాదిగలు) స్వీకరించారు. నేటికీ హైదరాబాదులో లక్షల మంది అనుచరులు రవిదాస్ కి ఉన్నారు. రవిదాస్ తను పుట్టిన కులాన్ని గొప్పగా భావిస్తూ తన తత్వంతో అనేకమంది రాజులను మెప్పిస్తూ మాదిగలని గొప్పవారిగా వారితో కూడా భావించేలా తన ప్రభావాన్ని చూపించగలిగాడు. రవిదాసు మంచి అందగాడు, ఆజానుబావుడు అపారమైన జ్ఞానశైలి తన స్వరంతో, తన కీర్తనలతో ప్రజలని వశపరచుకునేవాడు నాకు నీకు మధ్య నీకు నాకు మధ్య కులమత అడ్డుగోడలేంటి..? మనుషులందరూ సమానమే అని చెప్తూ మనువాదులకు ముచ్చెమటలు పట్టించేవాడు. 500 సంవత్సరాల క్రితం….
శూద్రుడు చమార్ గుణవంతుడు జ్ఞానవంతుడు అయినప్పటికీ పూజించకు…..
అనే మనువాద సిద్ధాంతానికి అభిముఖంగా *గుణ సంపన్నుడు జ్ఞాన సంపన్నుడు అయినా చమర్ పాదాలకు నమస్కరించు* అనే నూతన సిద్ధాంతాన్ని సంతు రవిదాస్ నిర్మించాడు. మనిషికి దేవుడి మధ్య ఉండే సంబంధం గురించి చెప్పడం కాదు పురోహితుడా మనిషికి మనిషికి మధ్య ఉండే సంబంధం ఏంటాని కుల వ్యవస్థను చీల్చి చెండాడి దేవుడి పేరుతో దోచుకునే వర్గంపై జ్ఞాన పంజాని విసిరినాడు సంతు రవిదాస్ మహారాజ్.
తన న్యాయవాదన ప్రతిభతో రాజుల దర్బార్ లో ఎందరో శాస్త్రులను రాజులను ఓడించి వారితోనే బంగారు కడియాన్ని తొడిగించుకొని వారిచేత కాళ్లు కడిగించుకున్న భారతదేశ చరిత్రలో తొలి మాదిగవాడు సంతు రవిదాస్. మాదిగ ధర్మం అంటే మానవ ధర్మమని మొట్టమొదసారి ప్రపంచం ముందు గర్జించిన జ్ఞాన సింహం సంతు రవిదాస్. చమర్ అంటే ఆత్మ న్యూనతతో బ్రతకాకుండా నిరంతరం చైతన్యులుగా ఉంటూ మాదిగలు(చమర్) బ్రతికితే సింహాసనం మీద కూర్చుంటూ స్వరాజ్యంలో బ్రతకాలి లేకుంటే స్మశానంలో ఉండాలి అంటే అత్యల్ప శాతం ఉన్న ఆధిపత్య వర్గాల చేత అత్యధిక శాతం ఉన్న మాదిగలు మరియు ఇతర వెనుకబడిన వర్గాలు బాధితులుగా, పాలితులుగా ఉండడం కంటే చావడం మంచిది అంటూ విప్లవాత్మక సిద్ధాంతానికి పురుడు పోశాడు. మాదిగల నామ రూప గుణాల్లో మార్పు తీసుకొస్తూ మాదిగయేతారులను సైతం ప్రభావితం చేసి వారిలోని అనంతశక్తిని బయటికి తీసిన గొప్ప మానసిక శాస్త్రవేత్త సంతు రవిదాస్. తన జ్ఞానం గానామృతంతో జంబూద్వీప ప్రజలందరినీ తన వెంట తిప్పుకున్న లోక రక్షకుడు సంతు రవిదాస్. దేవుడికి మనిషికి మధ్య ఈ దోపిడీ వ్యవస్థ ఎందుకు అనే ప్రశ్నల ఫిరంగులను పేల్చి దేశంలోని కుహనా మేధావి వర్గాలను ఉక్కిరిబికిరి చేసిన గొప్ప పోరాట యోధుడు సంతు రావిదాస్.
నాకు కావాల్సింది గుడి కాదు నా మాదిగల “గుడి” సే నాకు “గుడి” అని ప్రకటించిన తాత్వికుడు,మహాబాటసారి సంతు రవిదాస్ మహారాజ్. ఏ అడ్డంకులు లేకుండా ముందుకు వెళుతున్న సంతు రవిదాస్ తత్వానికి చిత్తోడు ఘడ్ సంస్థనాధిపతి కూతురు మీరాబాయి శిష్యరికం చేయడం మనువాద రాజులకి నచ్చక కపట ప్రేమతో సంతు రవిదాసు ని చిత్తోడు గడ్ సంస్థానానికి పిలిపించుకొని విషపు భోజనం పెట్టి ముక్కలు ముక్కలుగా నరికి చంపి నడివీధిలో పడేశారు. ఈ సత్యాన్ని బయటకి వ్యాప్తి చెందకుండా దేవుడు ఎక్కడున్నాడు సంతు రవిదాస్ అని ప్రశ్నిస్తే దేవుడు నా గుండెల్లో నా శరీరంలోనే ఉన్నాడు అని చెప్పి ఖడ్గంతో పొడుచుకొని నా గుండెల్లో దేవుడున్నాడు చూడండి అని చెప్తూ మరణించాడని కట్టు కథని అళ్లారు మనువాద చిత్తొడ్గడ్ ఆధిపత్య రాజ్యాధిపతులు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ కె జ్ఞానాన్ని ఇచ్చినవాడు సంతు రవిదాస్ వారి బోధనలు చమార్ సిక్కు మతస్థులు నేటికీ అనుసరిస్తున్నారు.సిక్కు మత ఆదిగ్రంథం లో రవిదాస్ యొక్క 41 కీర్తనలు చేర్చబడినవి.
సంతు రవిదాస్ యొక్క జ్ఞాన గొప్పతనం గురించి తెలుసుకొని తన తొలి గురువుగా ప్రకటించుకొని డాక్టర్.అంబేడ్కర్ తన గ్రంథాలను వారికి అంకితం చేశాడు.నేడు సంతు రవిదాస్ గురు రవిదాస్ మహారాజ్ గా, జగత్ గురు రవిదాస్ గా అనేక బిరుదులతో కీర్తించబడుతూ భారదేశం లొనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో సంతు రవిదాస్ మందిరాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఫిబ్రవరి 12 నుండి మూడు వారల పాటు భారతదేశం లోనే కాదు ఇతర దేశాల్లో లక్షలాదిగా ఉన్న రవిదాస్ అనుచరులు చాలా ఘనంగా వారి జయంతి ఉత్సవాలని చేస్తారు.
ఇక అత్యంత ముఖ్య విషయం రవిదాస్ భావాల నుండి పుట్టిన వాడు సంతు కబీర్, కబీర్ భావాల నుండి పుట్టినవాడు శివాజీ, శివాజీ పోరాట స్ఫూర్తి నుండి ఉద్భవించిన వారు జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ కాన్షీరాం లు.
కాన్షిరాం గారు దాదాపు 15 ఏళ్లపాటు చేసిన సామాజిక సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా పూలే అంబేడ్కర్ సాహు మహారాజ్ సిద్ధాంతానికి సంతు రవిదాస్ బోధనలని జోడించి ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ఉత్తర భారత మొత్తంలో ఎన్నో విజయాలు సాధించడానికి కాన్షీరాం కి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపిన వాడు సంతు రవిదాస్. సంతు రవిదాస్ ప్రభావం నేటికీ ఎంత గొప్పగా ఉన్నదంటే 2022 సంవత్సరం లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియనే జాతీయ భారత ఎలక్షన్ కమిషన్ వాయిదా వేసి సంతు రవిదాస్ ఉత్సవాలు అయిపోయాకనే ఎలక్షన్ కమిషన్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలని నిర్వహించింది ఎందుకంటే ప్రతి ఏటా ఫిబ్రవరి నెలలో జరిగే సంతు రవిదాస్ జన్మదిన ఉత్సవాలకు పంజాబ్ మరియు ఉత్తర,దక్షిణ భారత రాష్ట్రాల నుండి లక్షలాది,కోట్లాది మంది చమర్, రవిదాసియా కులస్తులు ఉత్తర ప్రదేశ్ లోని సంతు రవిదాస్ మందిరాన్ని సందర్శిస్తారు.
బుద్ధుని తర్వాత సమానత్వం కోసం పాటుపడిన ప్రముఖ వ్యక్తుల్లో ముఖ్యులు నిజమైన సమత మూర్తి సంతు రవిదాస్ మహారాజ్ బోధించిన విలువలని ప్రభుత్వాలు తూచా తప్పకుండా పాటిస్తే, భారతదేశాన్ని కుల మత వర్గ రహిత ఎలాంటి తారతమ్యాలు లేని సమాజంగా నిర్మించుకోగలం.