Praja Kshetram
తెలంగాణ

మానాన్న కొన్న స్థలాన్ని కొందరూ వ్యక్తులు కబ్జాకు యత్నం : రాచమల్ల దయానంద్

మానాన్న కొన్న స్థలాన్ని కొందరూ వ్యక్తులు కబ్జాకు యత్నం : రాచమల్ల దయానంద్

 

 

రాజేంద్రనగర్ ప్రతినిధి ఫిబ్రవరి 12(ప్రజాక్షేత్రం ):మానాన్న కొన్న స్థలాన్ని కొందరూ వ్యక్తులు కబ్జాకు పాల్పడుతున్నారని, తమ స్థలంలో గతంలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని రాచమల్ల దయానంద్ అన్నారు.అయితే నను భయభ్రాంతులకు గురి చేసి భూకబ్జాదారులు దానిపై ప్రీకాస్ట్ నిర్మాణం చేస్తున్నారని భూ యజమని రాచమల్ల దయానంద్ ఆరోపించారు. శంషాబాదు మున్సిపాలిటీ పరిధిలోని సంపత్ నగర్ సర్వే నంబర్ 7025/34/2ఆ కి చెందిన సుమారు 1.27 గుంటల స్థలం కోర్టు కేసుల్లో ఉంది. ఈ స్థలం తమది అంటూ ఇరు వర్గాల మధ్య పోరాటం గత కొంత కాలంగా సాగుతోంది. తాజాగా విజయ్ కుమార్,పంకజ్,రామ్ రెడ్డి,రోహిత్ అనే వ్యక్తులు 1.27 గుంటల స్థలంలో ప్రీకాస్ట్ నిర్మిస్తున్నాడు.ఈ విషయాన్ని గమనించిన భూ యజమాని రాచమల్ల దయానంద్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసుల నుండి ఎలాంటి స్పందన రాలేదని దయానంద్ తెలిపారు. వాస్తవానికి ఈ స్థలానికి సంబంధించిన ఇష్యు కోర్టులో ఉన్నదని,కోర్టులో కేసు నడుస్తున్న సమయంలో కొందరు భూకబ్జాదారులు పోలీసుల సహకారంతో ప్రికాస్ట్,ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కబ్జాదారులకు పోలీసులు కూడా సహకరిస్తున్నారని రాచమల్ల దయానంద్ ఆరోపించారు.వెంటనే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని రాచమల్ల దయానంద్ కోరారు.

Related posts