Praja Kshetram
తెలంగాణ

ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా ఫౌండేషన్ అధ్యక్షుడికి ఘనంగా సన్మానం

ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సేవా ఫౌండేషన్ అధ్యక్షుడికి ఘనంగా సన్మానం

 

 

శంకర్ పల్లి ఫిబ్రవరి 12(ప్రజాక్షేత్రం):భారత మాజీ కుటుంబ సురక్ష పథకంలో ప్రతి ఎక్స్ సర్వీస్ మెన్ చేరాలని తెలంగాణ రాష్ట్ర ఎక్స్ సర్వీస్ మెన్ ప్రతినిధి రమేష్ బాబు జగన్నాథం పేర్కొన్నారు. బుధవారం ఎక్స్ సర్వీస్మెన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అసోసియేషన్ టెన్ ఇయర్స్ సెలబ్రేషన్స్ 2025 సందర్భంగా సీనియర్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆఫీసర్లకు సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్యూటీలో ఉన్నవారు మరణాంతరం కూడా ఈ పథకంలో చేరిన వారి అందరికీ భవిష్యత్తులో చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నారు. వీటికి సంబంధించిన కరపత్రాలను అందరికీ అందించారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షులు ఆర్. నరేష్ కుమార్ మాట్లాడుతూ దేశాన్ని కాపాడడానికి సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించే మీ కుటుంబాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులను విడుదల చేసి గౌరవించాలి అన్నారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు జిలాని, జనరల్ సెక్రెటరీ బొబ్బిలి జగదీశ్వరరావు మాట్లాడుతూ హాజరైన హాజరైన మాజీ సైనికుల వీర గాధలను వారి హోదాలను చక్కగా వివరించారు. ఆ తర్వాత సేవ ఫౌండేషన్ అధ్యక్షులు నరేష్ గారిని శాలువాతో సత్కరించి, మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆర్మీ కుటుంబాల మహిళలను అసోసియేషన్ కార్యదర్శి ముకుందరావు గౌరవ వందనం చేశారు.

Related posts