Praja Kshetram
తెలంగాణ

తాండూరులో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరులో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు కృషి చేస్తా : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

 

పెద్దేముల్ ఫిబ్రవరి 12(ప్రజాక్షేత్రం):అర్హులైన, నిజమైన జర్నలిస్టులకు ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం టీయూడబ్ల్యూజే-ఐజేయూ డివిజన్ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతో జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ రోడ్డు మార్గంలోని జీపీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి టీయూడబ్ల్యూజే- ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారిలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి తాండూరు పట్టణంలో ఖాళీగా ఉన్న దూరదర్శన్ కేంద్రంలోని భవనంలో తాత్కాళిక ప్రెస్ భవన్ ఏర్పాటు చేసేందుకు చొరవ చూపించాలని వినతిపత్రం అందజేశారు. అంతకుముందు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలోని జర్నలిస్టులందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. యూనియన్ సభ్యులు కోరిన విధంగా ప్రెస్ భవన్ ఏర్పాటుకు తోడ్పాటు అందిస్తామన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా జర్నలిస్టుల ప్రమాద బీమా సౌకర్యానికి తనవంతుగా ఆర్థిక చేయూత అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా చాలాకాలంగా ఎదురు చూస్తున్న నిజమైన, అర్హులైన పేద జర్నలిస్టులందరికి డబుల్ బెడ్ రూం. లేదా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. దశల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లను మంజూరు చేయించేలా దృష్టిసారిస్తామన్నారు. మరోవైపు అంతారం గుట్టపై ఉన్న జర్నలిస్టుల కాలనీలో భూమి సర్వే పనులను పరిష్కరించేలా చూస్తామన్నారు. దీంతో పాటు తాండూరులోని బస్వరాజ్ ఇంట్లో జరిగిన చోరీ ఘటనలో నిందితులను త్వరలో పట్టుకుని న్యాయం జరిగేలా చూస్తామని భరోసా అందించారు. మరోవైపు టీయూడబ్ల్యూజే లో చేరిన 143 యూనియన్ సభ్యులకు సభ్యత్వాన్ని అందజేశారు.

హౌసింగ్ కమిటీ ఏర్పాటు..

అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ఎంపిక కోసం టీయూడబ్ల్యూజే-ఐజేయూ హౌసింగ్ కమిటిని ఎన్నుకున్నారు. తాండూరు పట్టణ కమిటీ సభ్యులుగా రామకృష్ణ, గోపాల్, తాండూరు మండల కమిటీ సభ్యులుగా సంగమేష్, యాలాల మండల కమిటీ సభ్యులుగా జావిద్, బషీరాబాద్ మండల కమిటీ సభ్యులుగా శివకుమార్, పెద్దేముల్ మండల కమిటీ సభ్యులుగా కృష్ణలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు వాసు, సీనియర్ పాత్రికేయులు కొనింటి ప్రభాకర్, లింగేష్, శివానంద్, కృష్ణ, నర్సింలు, తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి మహేష్, తాండూరు మండల అధ్యక్షుడు సంగమేశ్వర్, వెంకట్ రాం రెడ్డి, వెంకటేష్, పెద్దేముల్ మండల అధ్యక్షుడు పాండు, ప్రధాన కార్యదర్శి గయాజ్, రిపోర్టర్లు నర్సింహులు, వెంకట్ రెడ్డి, గౌస్, శ్రీనివాస్, శ్రీనివాస్, రవీంద్ర, యాలాల మండల ప్రతినిధులు జావిద్, రాములు, రఘురాంరెడ్డి, బషీరాబాద్ మండల అధ్యక్షులు శివకుమార్, శ్రీనివాస్ రెడ్డి, రాంరెడ్డి, వివిధ మండలాల జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Related posts