Praja Kshetram
క్రైమ్ న్యూస్

వెంకటేశ్వర గుట్ట పక్కన ఉన్న కుంటలో పడి వ్యక్తి మృతి

వెంకటేశ్వర గుట్ట పక్కన ఉన్న కుంటలో పడి వ్యక్తి మృతి

 

 

నిజామాబాద్ ఫిబ్రవరి 13(ప్రజాక్షేత్రం):ఆలూర్ మండల కేంద్రంలో వెంకటేశ్వర గుట్ట ప్రక్కన ఉన్న నీటి కుంటలో మృతిదేహం గురువారం లభ్యమైంది. ఆర్మూర్ యస్,ఐ తిరునగరి గోవింద్ వివరాల ప్రకారం తీర్మాన్ పల్లి ముత్తెన్న వయస్సు (55)అని గుర్తించారు. మృతి దేహం పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉంది కావున పోస్టుమార్టం నిమిత్తం మృతిదేహం వద్దనే నిర్వహించారు. కుటుంబీకుల వివరాల ప్రకారం కొన్ని సంవత్సరాల నుండి మతిస్థిమితం లేదు గత నాలుగు రోజుల నుండి కనబడుటలేదని తీర చూస్తే కుంటలో పడే చనిపోయాడని కుటుంబీకులు రోదిస్తున్నారు.

Related posts