పట్టభద్రుల ఎన్నికల నుండి తప్పుకున్న గంగాధర్ మధనం
-ఎమ్మెల్సీ అభ్యర్థి గంగాధర్ మధనం కీలక ప్రకటన
-కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకే నేను తప్పుకుంటున్నాను.
-ఎవరు దూషించదు.
నిజామాబాద్ ఫిబ్రవరి:13(ప్రజాక్షేత్రం):పట్టభద్రుల ఎన్నికలు నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ ఉమ్మడి జిల్లాలలో జోరుగా జరుగుతున్నాయని విషయం తెలిసిందే ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ బరిలో గంగాధర్ మధనం (డీఎస్పీ) పట్టభద్రుల ఎన్నికలలో నుండి తప్పుకుంటున్నానని ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతం,రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం,పట్టభద్రుల సంక్షేమం కోసం12 సంవత్సరాల ఉద్యోగా జీవితాన్ని పణంగా పెట్టి, ఐ,పీ,ఎస్ అయే అవకాశం ఉన్నప్పటికీ నేను పదవి విరమణ (వి,ఆర్,ఎస్) పొంది రాజకీయాల్లోకి వచ్చాను.నేను వచ్చిన మొదటి రోజు నుండి మీరు నన్ను మనస్ఫూర్తిగా స్వీకరించి,ఒక సైన్యం లాగా ఏర్పడి,నా కోసం పని చేయడం మొదలు పెట్టారు,మాన శక్తిని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం నాకు కాంగ్రెస్ పార్టీ నుండి బీఫార్మ్ ఇవ్వలేదని బాధపడి,నిన్న స్వయంగా రాష్ట్ర సచివాలయానికి పిలుచుకొని,నన్ను ఎన్నికల భారిలో నుండి వైదొలుగుమని,మాన అవసరం ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉందని చెప్పి,స్వచ్చందంగా కాంగ్రెస్ పార్టీకి మన సేవలు కావాలని కోరారు,అనేక మంది నిపుణులతో,ఆత్మీయులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ రోజు నేను ఎమ్మెల్సీ బరిలోనుండి తప్పుకున్నాను, కాంగ్రేస్ పార్టీ అధిష్టానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో ముఖ్య పాత్ర పోషించి, ఇప్పటివరకు నా దృష్టికి వచ్చిన సమస్యలన్నింటిని పరిష్కరించేలా నేను పోరాడుతానని అన్నారు.అలాగే మొదటి రోజు నుండి నేటి వరకు నా కోసం పని చేసిన నాయకులకు,కార్యకర్తలకు,మరియు పట్టభద్రులకు నేను రుణ పడి ఉంటాను.