నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్, ఫిబ్రవరి 16(ప్రజాక్షేత్రం):
హైదరాబాద్ లోని మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం దారుణం చోటుచేసుకుంది. మేడ్చల్ బస్ డిపో ముందు పట్టపగలే అందరూ చూ స్తుండగా,గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఉమేష్ అనే వ్యక్తిని దారుణంగా కత్తులతో నరికి చంపేశారు. చనిపోయిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా మాచా రెడ్డికి చెందిన ఉమేశ్‌గా గుర్తించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఉమేశ్‌పై కత్తులతో దాడి చేస్తుండగా అక్కడే ఉన్న జనం చూస్తూ ఉండి పోయారే తప్ప ఎవరూ ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు.పైగా ప్రజలు ఈ తతంగమంతా చూస్తూ ఉండిపోవడం గమనార్హం.