పర్వేద లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
– 22 సంత్సరాల తరువాత కలయిక
– ఆత్మీయ అలింగనాలుతో, ఆత్మీయ పాలకరింపుల తో ఉప్పొంగిన సంతోషం
– 22 సంవత్సరాల ఉపాధ్యాయుల ప్రసంగంలతో ఉద్వేగమైన సభ ప్రాంగణం
శంకర్ పల్లి ఫిబ్రవరి 16(ప్రజాక్షేత్రం):వారంతా చిన్ననాటి స్నేహితులు.. ఒకేచోట చదువుకున్నారు. పదో తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా, మరికొంత మంది వ్యాపారం, ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. పర్వేద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు ఆదివారం పర్వేద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర జ్ఞాపకాలు నెమరేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను శాలువతో ఘనంగా సన్మానించారు. 50 మంది పూర్వ విద్యార్థులందరూ ఒకేచోట చెరడంతో సందడి నెలకొంది. ఇక నుంచి టచ్ లో ఉండాలంటూ.. ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు ఈ మధుర జ్ఞాపకాలను తమ సెల్ఫోన్ల లో బంధించుకున్నారు. 22 సంవత్సరాల నుండి ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొని ఏక్కడెక్కడో స్థిర పడి ఉన్నతమైన స్థానాలలో స్థిర పడ్డ విద్యార్థులు అందరూ ఒక్కదగ్గరికి రావడం ఎంతో గొప్ప మధురాను బూతులని ఉపాధ్యాయులు కొనియాడారు. వారు మాట్లాడుతూ.. 22 సంవత్సరాల తరువాత ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ప్రాయాసతో కూడుకున్నదని, అందరినీ ఒక్కచోటికి చేర్చడానికి ఆర్గనైజింగ్ టీం చేసిన కృషిని అభివర్ణించలేమని అన్నారు. ప్రతి విద్యార్థికి తల్లిదండ్రులు మొదటి గురువులని, ఆ తర్వాతి స్థానం గురువులదేనని, గురువు నేర్పిన విద్యాబుద్ధులు విద్యార్థి జీవితానికి ఉన్నతమైన జీవనం కొనసాగించడానికి, జీవితంలో గొప్పగా స్థిరపడడానికి, సమాజంలో ఉన్నతంగా రాణించడానికి, ఎంతగానో దోహదం చేస్తాయని అన్నారు. జీవితమనేది ఓ పెద్ద సముద్రమని సముద్రంలో ఈదడం ఎంత కష్టమో, అదేవిధంగా సంసార జీవితంలో ముందుకు సాగడం అంతే కష్టమని, కష్ట సుఖాలను, విజయ అపజయాలను, దాటుకుని సమాజంలో గౌరవప్రదంగా జీవనం కొనసాగిస్తూ, సమాజాభివృద్ధికి తోడ్పడాలని గురువులు అన్నారు. పర్వేద ఉన్నత పాఠశాలలో పనిచేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని, అక్కడ చదువుకున్న విద్యార్థులు అందరూ మండల స్థాయి ర్యాంకులతో గ్రామానికి తమకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చారని ఆ మధురాని బూతులను మరువలేమని గురువులు కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు హస్త అవధానం అష్టఅవాధని మలుగా అంజయ్య, అనిల్ కుమార్, సంగారెడ్డి, ఆనంద్, శ్రీనివాస్, శ్రీరాములు, లక్ష్మయ్య, సికిందర్, రవీందర్ రెడ్డి, రాములు, విజయ్ భాస్కర్ లు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. 22 సంవత్సరాల తర్వాత తమను గుర్తుచేసుకొని తమని కార్యక్రమానికి పిలిచి గొప్పగా సన్మానం చేసి తమ ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చిందని వారు తెలిపారు. 22 సంవత్సరాల తర్వాత అందర్నీ ఏకతాటిపైకి తీసుకురావడానికి, కార్యక్రమాన్ని నడిపించడానికి శ్రమించిన బైడ్ల శ్రీనివాస్, ఎర్వగూడ శ్రీకాంత్, మోహన్ సాగర్, శివకుమార్, లష్మినారాయణ, నర్సింలు, మాణిక్యం లకు కృతజ్ఞతలు తెలిపారు.