పెద్దగట్టు జాతర సరళిని పరిశీలించిన ఎస్పి సన్ ప్రీత్ సింగ్
సూర్యాపేట, ఫిబ్రవరి 16(ప్రజాక్షేత్రం):సూర్యాపేట, మండల కేంద్రంలోని దురాజుపల్లి పెద్దగట్టు జాతర సరళని ఆదివారం ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ పోలీస్ కంట్రోల్ రూం లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కమాండ్, కంట్రోల్ సెంటర్ నుండి పరిశీలించారు. అనంతరం గుట్టు చుట్టూ భద్రత చర్యలను తనిఖీ చేశారు. పోలీసు బందోబస్తు ము పరిశీలించారు. పెద్దగట్టు పై దేవస్థానం వద్ద బందోబస్తు పరిశీలించారు. ఎగ్జిబిషన్ రోడ్డు,కోనేరు,విఐపి మార్గం, హైవే పై వాహనాల శ్రేణి, తూర్పు మెట్లు వద్ద బందోబస్తు,భద్రత చర్యలు తనిఖీ చేశారు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి నాగేశ్వరరావు, ఏ ఆర్ అధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి,డిఎస్పీ రవి,శ్రీధర్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం సిబ్బంది పాల్గొన్నారు.