Praja Kshetram
జాతీయం

గ్రామ సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వం

గ్రామ సమస్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వం

 

– సంవత్సరం నుండి గ్రామాల పరిస్థితి అధోగతి

– గ్రామాల సమస్యలను పట్టించుకునే నాధుడే కరువాయే

మొయినాబాద్, ఫిబ్రవరి 16(ప్రజాక్షేత్రం):మండలంలోని మొయినాబాద్ నూతన మున్సిపాలిటీగా కొలువైన యేన్కేపల్లి వార్డు కార్యాలయం అనుబంధ గ్రామమైన జివాన్ గూడ ప్రధాన రహదారి పైన అండర్ డ్రైనేజీ పైపు పగిలిపోవడంతో 15 రోజులుగా దుర్వాసన విదచల్లుతున్న పట్టించుకోని గ్రామ సెక్రెటరీ వెంకట్ రెడ్డి. బస్తీలో ఈ దుర్వాసనకు అనేకమైన దోమలు ఇళ్లలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇళ్లలో ఉండే చిన్నపల్లలు అనారోగ్య బారిన పడుతున్నారు. గ్రామ సెక్రెటరీకి పలుమార్లు ఆయన దృష్టికి తీసుకెళ్లిన చేద్దాంలేని అని సమస్యను తోసి పుచ్చుతున్నారు. సమస్య తన దృష్టికి వెళ్లిన ప్రభుత్వం పెట్టిన బిల్లులకు ఇప్పటికీ బిల్లులు చెల్లియడం లేదని, ఉలుకులేదు పలుకు లేదు జీతాలు మూడు నెలల నుంచి చెల్లించడం లేదు, ఎన్ని బిల్స్ పెట్టినా అవి కూడా రావడం లేదని ఏవేవో సాకులు చెబుతూ కాలం గడుపుతున్నారు.వీధిలైట్లు సరిగ్గా రావడం లేదు. అయినా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక 13 నెలలుగా సర్పంచ్ పదవి ఖాళీగా ఉన్న ప్రభుత్వం ఇప్పటికీ ఎలక్షన్లు జరపడం లేదు.ఇంకా ఎన్ని రోజులు ఎన్ని నెలలు పడుతుందో కూడా క్లారిటీ లేదు. కనీసం 15 నెలలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి ఇప్పటివరకు ఎక్కడి గొంగడి అక్కడే వేసినట్టు ఉంది.గ్రామాల్లో ఉన్న సెక్రటరీలైన చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ప్రభుత్వానికి పెద్ద మచ్చే తెచ్చిపెడుతుంది. కాబట్టి సెక్రటరీ, కమిషనర్లు, ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఏ సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

Related posts