నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్
చేవెళ్ల, ఫిబ్రవరి 18(ప్రజాక్షేత్రం):వైద్యుల నిర్లక్ష్యంతో మహిళా మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పట్టణంలోని సాధన పట్నం మహిండర్ రెడ్డి హాస్పిటల్ లో జరిగింది.బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలం అంగడి చిట్టెంపల్లి గ్రామానికి చెందిన సుంచు మమత భర్త శ్రీశైలం (28) గర్భసంచి ఆపరేషన్ కోసం సాధన ఆస్పత్రిలో చేరింది.రెండ్రోజుల క్రితం వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేశారు. సోమవారం ఉదయం మహిళకి ట్రీట్మెంట్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదని ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేశారని తెలిపారు.ఆ సమయంలో ఆమెకి ఒక ఇంజక్షన్ ఇవ్వబోయి ఇంకొక ఇంజక్షన్ ఇచ్చినందుకు చనిపోయిందని వాళ్ళు తెలుపుతున్నారు.దాంతో గుట్టు చప్పుడు కాకుండా ఆస్పత్రి యాజమాన్యం ఆమెను హైదరాబాద్ లో ఒక ప్రైవేటు ఆసుపత్రికి రిఫర్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.అప్పటికే ఆమె మృతి చెందినట్టు డాక్టర్లు ధ్రువీకరించారు. ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
మహిళకు ఆపరేషన్ జరిగిన రెండో రోజే మృతి చెందడంతో మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బైటాయించారు.ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ ఆస్పత్రి సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.
గొడవ పెద్దదవుతుండటంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి బంధువులకు నచ్చజెప్పిరు.
– మమత భర్త ఆవేదన
డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నా భార్య చనిపోయిందని భర్త శ్రీశైలం తెలిపారు.పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ లో గత మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాము మూడు రోజుల నుంచి నేను గమనించింది ఏమిటంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు,ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే డాక్టర్లకు వాట్సాప్ ద్వారా ఫొటోస్ పంపించి ట్రీట్మెంట్ చేస్తున్నారు.అసలు అలా చేయొచ్చా ఈ హాస్పిటల్లో నా భార్య ఒక్కటే కాదు ఇంకా ఎన్నో కేసులు ఇలానే చేశారని ఆరోపణలు ఉన్నాయి. నా భార్యకి ఏం జరిగింది ?ఏం చేశారు? నాకు తెలియాలి అని ఆరు పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ ని ప్రశ్నించారు. నా భార్యకు న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. రెండు రోజులు నా భార్య ఎంతో సంతోషంగా ఉంది యాక్టివ్ గా ఉంది కానీ వారు ట్రీట్మెంట్ సరింగా చేయక వేరే హాస్పటల్ కి రిఫర్ చేసి నా భార్యని చంపేశారు తగిన న్యాయం చేయాలని కోరారు.
– పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ నుంచి ప్రజలకు విముక్తి కలిగించండి
పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ లో వాచ్మెన్ నుంచి డాక్టర్ల వరకు అందరూ నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు.అక్కడ ఉన్న సిబ్బంది కూడా పేషంట్లని తీసుకురావడానికి కూడా విరక్తి వచ్చినట్టు ప్రవర్తిస్తారు.వచ్చిన ఈ పేషెంట్ కి ఒక మర్యాద ఉండదు సరైన సమయంలో వైద్యం అందదు వీటిపై ఎవరిని ప్రశ్నించాలి…? ప్రశ్నిస్తే మార్కెటింగ్ పి ఆర్ ఓ లు వచ్చి సంజాయిసి చెప్తారు. ఉన్న సమస్యని మాత్రం పరిష్కరించడానికి ప్రయత్నించరు కానీ అవతలను సంజాయిస్సి చెప్పి పంపిస్తారు.డాక్టర్లు సైతం వాళ్ళ రూములలో నిద్రిస్తారు అక్కడ ఉన్న ట్రైనింగ్స్ స్టూడెంట్స్ ట్రీట్మెంట్ అందిస్తారు.వాళ్లే డాక్టర్లు అయిపోయినట్టు ప్రవర్తిస్తారు. మరి పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ లో డాక్టర్లు ఉండి ఏం లాభం..? ఇటువంటి సంఘటనలు ఇంతకుముందు చాలానే జరిగాయి అంటూ స్థానిక ప్రజలు తెలుపుతున్నారు.ఇటువంటి హాస్పిటల్స్ నుంచి వైద్యులకు విముక్తి కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.
