తీరనున్న త్రాగు నీటి కష్టాలు.
– నూతన బోరింగ్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మహేందర్ రెడ్డి.
– హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు, గ్రామ ప్రజలకు.
బషీరాబాద్ ఫిబ్రవరి 18(ప్రజాక్షేత్రం):సోమవారం ప్రజాక్షేత్రం దినపత్రికలో “మాకు నీటి ఇబ్బందులు తీర్చండి” అనే శీర్షికతో ప్రచురించిన కథనానికి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మహేందర్ రెడ్డి స్పందించి కాలనీవాసులకు బోర్వెల్ తెప్పించి కొత్త బోర్ వెయ్యడం జరిగింది. దీంతో కాలనీవాసులకు తాగునీటి కష్టాలు తీరనున్నట్లు మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఈ క్రమంలో ఎన్నో రోజులుగా త్రాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్న మాకు ఆపద్బాంధవుడులా ముందుకు వచ్చి కొత్త బోరు వేయించిన మహేందర్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.