Praja Kshetram
క్రైమ్ న్యూస్

బిల్లు మంజూరు చేసేందుకు లంచం అడిగిన అధికారి…అడ్డంగా దొరికిన వైనం  

బిల్లు మంజూరు చేసేందుకు లంచం అడిగిన అధికారి…అడ్డంగా దొరికిన వైనం

 

కార్వాన్ ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్సీ, ఎస్టీ సెల్ జీఎం ఆనంద్ కుమార్ పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే మాసబ్ ట్యాంక్ లోని తెలంగాణ షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఎఫ్ఏసీ జనరల్ మేనేజర్ బొప్పరి ఆనంద్ కుమార్ ను ఆయన కార్యాలయంలో పట్టుకున్నారు. ఓ ఫిర్యాదు దారుడు తనకు 33 లక్షల 32 వేల 350 రూపాయల బిల్లును ప్రాసెస్ చేసేందుకు ఏఓ ను కోరాడు. కాగా ఆ అధికారి బహుమతిగా ఫిర్యాదుదారున్ని రూ. లక్ష 33 వేల లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఆ ఫిర్యాదుదారుడు లక్ష రూపాయలు గురువారం మధ్యాహ్నం అధికారి కార్యాలయంలో ఇచ్చాడు. వెంటనే ఏసీబీ అధికారులు దాడులు చేసి ఆనంద్ కుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Related posts