కొత్తగూడెం నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మం ఫిబ్రవరి 20 (ప్రజాక్షేత్రం):తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొత్తగూడెం నియోజకవర్గంలో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా కొత్తగూడెం త్రీ ఇంక్లెన్ లో ఈ నెల 23న జరగనున్న ఓ వివాహ వేడుకకు, లక్ష్మీదేవిపల్లిలో ఈ నెల 23న జరగనున్న ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పట్టు వస్త్రాలను కానుకగా సమర్పించారు. అదేవిధంగా పాల్వంచలో ఇటీవల నూకల రంగారావు తల్లి చనిపోగా వారి కుటుంబాన్ని, కేసుపాక ప్రసాద్ చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్ధించారు.