Praja Kshetram
తెలంగాణ

తెలంగాణ మహిళా కాంగ్రెస్ దేశంలోనే టాప్ : రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు

తెలంగాణ మహిళా కాంగ్రెస్ దేశంలోనే టాప్ : రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు

 

– సంబరాల్లో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీమ్ భరత్

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ సభ్యత్వాలు లక్షకు పైగా రావడం, దేశంలోనే సభ్యత్వాలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు అన్నారు. ఈ నేపథ్యంలో గురువారం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సంబరాలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు సునీత రావు మాట్లాడుతూ దేశంలోనే సభ్యత్వాలో అగ్రగామిగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిలిచిందని తెలిపారు. ఇది తన విజయం కాదని, సభ్యత్వాలు చేసిన ప్రతి ఒక్క అక్క, చెల్లెల విజయమని చెప్పారు. ఈ మెంబర్షిప్ ల వెనుక అందరి కష్టం ఉందన్నారు. నేడు అన్ని రాష్ట్రాల కంటే పై స్థానంలో తెలంగాణ మహిళా కాంగ్రెస్ నిలబడిందని హర్షం వ్యక్తం చేశారు. ఇక లక్ష సభ్యత్వాలు దాటిన సందర్భంగా సంబరాలు అంబరాన్ని అంటే విధంగా డప్పు వాయిద్యాలతో, బాణాసంచా కాల్చి, నృత్యాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts