ఫిర్యాదు చేసిన పట్టించుకోని పంచాయతీ సెక్రెటర
నిజామాబాద్ ఫిబ్రవరి 20(ప్రజాక్షేత్రం):గ్రామ సర్పంచ్ లు లేనందున గ్రామాలలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆలూర్ మండలం కల్లేడి గ్రామంలో మురికి కాలువలు తీయకుండా చాలా రోజుల నుండి ఉండడంతో గ్రామ ప్రజలు పంచాయతీ సెక్రెటరీ కి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకుంటలేదు. అని మురికి కాలువ కూడుకుపోయి నీరు వాకిట్లోకి చేరుకుంటుందని దీని వల్ల దోమలు తయారవుతున్నాయని ఇంట్లో భోజనం చేస్తుంటే దుర్వాసన వస్తుందని తెలిపారు. సెక్రెటరీ చెప్పిన ఇతర సిబ్బందికి చెప్పిన పట్టించుకుంటలేరు. ఇప్పటికైనా తక్షణమే పంచాయతీ సెక్రెటరీ చర్య తీసుకుని మురికి కాల్వలను శుద్ధి చేయాలని ప్రజలు మీడియాతో వాపోయారు.