జేర్రిపోతుల బిక్షమయ్య గౌడ్ మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు
– సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి
చండూరు ఫిబ్రవరి 21(ప్రజాక్షేత్రం):మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన జెర్రీ పోతుల భిక్షమయ్య ప్రజాసంఘాలలో చురుకుగా పాల్గొని గీత కార్మిక సంఘం కూలి సంఘాల్లో పాల్గొని ముందు నడిచినటువంటి కామ్రేడ్ బిక్షమయ్య అకాల మరణం పార్టీకి తీరనిలోటని సుధాకర్ రెడ్డి అన్నారు. వారి కుటుంబానికి సిపిఎం పార్టీ నల్గొండ జిల్లా కమిటీ పక్షాన ప్రగాఢ సానుభూతి ప్రకటించి వారికి ఎల్లవేళలా అండదండలు ఇస్తామని ఆయన అన్నారు వారి కుమారుడు అయిన జెర్రీపోతుల ధనంజయ గౌడ్ పార్టీలో చండూరు మండల కార్యదర్శిగా పనిచేస్తూ చురుగ్గా పాల్గొంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడని ఆయన సహకారంతో ముందుకు నడిచేవాడని వారు కొని ఆడారు ఈ సంతాపం తెలియజేసిన వారిలో కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం చిన్నపాక లక్ష్మీనారాయణ పాలడుగు నాగార్జున సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి మల్లం మహేష్ సిఐటియు మండల నాయకులు లింగయ్య వెంకటేశ్వర్లు పగిళ్ల బిక్షం, నల్లగంటి లింగస్వామి, కత్తుల సైదులు, హమాలి సంఘం నాగరాజు, యాదయ్య తదితరులు ఉన్నారు.