Praja Kshetram
తెలంగాణ

ప్రపంచం చూపు సోషలిజం వైపు

ప్రపంచం చూపు సోషలిజం వైపు

– సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం

చండూరు ఫిబ్రవరి 21(ప్రజాక్షేత్రం):సమాజంలో అన్ని సమస్యలకు పరిష్కారం అంతిమంగా సోషలిజమేనని సిపిఐ(ఎం)జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలోని రెడ్ బుక్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం సిహెచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ దేశంలో పేదరికం దరిద్రం నిరుద్యోగం, తీవ్రమైన ఆర్థిక అసమానతల తో పాటు సమస్త సమస్యలకు అంతిమ పరిష్కారం సోషలిజం మాత్రమేనని వారన్నారు. 1848లో మార్క్స్ ఎంగిల్స్ రాసిన కమ్యూనిస్టు మేనిఫెస్టో ప్రపంచ చరిత్ర గతిని మార్చిన ఒక మహా పుస్తకం అని దాని ఆధారంగానే ఈ ప్రపంచంలో అనేక విప్లవాలకు అంకురార్పణ జరిగిందని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాలను వేగంగా అమలు చేస్తూ దేశ సంపదను స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు ధారా దత్తం చేస్తుందని విమర్శించారు. ఈ విధానాలపై ప్రజలు ప్రశ్నించకుండా మతతత్వాన్ని రెచ్చగొడుతూ ప్రజలను విభజిస్తూ తమ రాజకీయ పబ్బం గడుపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 50 లక్షల 65 వేల 345 కోట్ల బడ్జెట్ కార్పోరేట్ శక్తులకే తప్ప దేశ ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మార్చిలో పెట్టబోయి రాష్ట్ర బడ్జెట్ ఇచ్చిన హామీల అమలకు సరిపడా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Related posts