Praja Kshetram
తెలంగాణ

మాజీ సర్పంచ్ అండదండలతో పంచాయతీ కార్యదర్శి ఓవరాక్షన్.

మాజీ సర్పంచ్ అండదండలతో పంచాయతీ కార్యదర్శి ఓవరాక్షన్.

 

– రికార్డులో ఇల్లు మార్పిడి కొరకు 17వేలు రూపాయలు వసూలు చేసిన సెక్రెటరీ.

– గోపులారం పంచాయతీ కార్యదర్శి ఇష్టారాజ్యం.

– మహా అయితే సస్పెండ్ చేస్తారు అంతకుమించి ఏం చేస్తారు మీరు.

– పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో కు వినతిపత్రం

కొండాపూర్ ఫిబ్రవరి 21(ప్రజాక్షేత్రం):గ్రామాలలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామంలోని పూర్తి బాధ్యతలు పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలో గోపులారం గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ ఇస్టను సారంగా విధులకు గైరహాజారు కావడంతో, సమయపాలన పాటించకపోవడంతో తమ గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు అందడం లేదని, ప్రభుత్వం చేపట్టిన సర్వేలు ప్రైవేట్ వ్యక్తులతో చేయించడం, పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం వల్లనే సరైన అర్హులకు లబ్ధి చెందలేదని, ప్రభుత్వ పథకాలు మాకెందుకు రాలేదని కార్యదర్శిని అడగగా.. దబాయిస్తూ.. పథకాలకు మాకు ఎలాంటి సంబంధం లేదని మా పై అధికారులకు ఫిర్యాదు చెయ్యండి అని అంటున్నారు అని అన్నారు . గోపులారం గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాస్ కి వినతి పత్రం గ్రామ ప్రజలు అందజేశారు.

– ప్రశ్నిస్తున్న గ్రామస్తుల నోటికి తాళాలు వేసి ఇబ్బంది పెడుతున్న సెక్రెటరీ, మాజీ సర్పంచ్.

ఇల్లు మార్పిడి కొరకై చర్ల గోపులారం గ్రామానికి మంగలి శ్రీకాంత్ అనే వ్యక్తి 17వేల రూపాయలు చెల్లించినప్పటికీ కేవలం 5వేల రూపాయల రసీదు ఇచ్చి మిగతా 12 వేల రూపాయల రసీదు ఇవ్వకుండా అతని ఇల్లు రికార్డులో మార్పిడి చేయకుండా మూడు గంటలు గ్రామపంచాయతీలో ఉండమని చెప్పి చివరికి మాకు తెలియదు పై అధికారుల దగ్గరికి వెళ్లి ఏమన్నా చేసుకో నేను సంతకం పెట్టా అని పంచాయతీ సెక్రెటరీ గ్రామస్తులతో వాగ్వాదం చేసుకోంది.

Related posts