తీన్మార్ మల్లన్న ను కలిసి నవాబుపేట్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్
నవాబుపేట్ ఫిబ్రవరి 24(ప్రజాక్షేత్రం):సోమవారం హైదరాబాద్ ఆఫీస్ లో నవాబు పేట్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తో ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. మండల లో మొదటినుండి కాంగ్రెస్ పార్టీలో పని చేసిన కార్యకర్తలకు నాయకులకు, సరైన న్యాయంతో పాటు తగు గుర్తింపు కల్పించాలని అదే విధంగా పార్టీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానంతో కూడిన పదవులతో గౌరవించి, వారి శ్రమకు గుర్తింపుకల్పించాలని కోరినట్టు కొండల్ యాదవ్ తెలిపారు.