Praja Kshetram
తెలంగాణ

మహా శివరాత్రి ఉపవాసం ఉంటున్నారా? అయితే తినాల్సిన తినకూడని ఆహారాలివే!

మహా శివరాత్రి ఉపవాసం ఉంటున్నారా? అయితే తినాల్సిన తినకూడని ఆహారాలివే!

 

ప్రజాక్షేత్రం వెబ్ డెస్క్: మహా శివరాత్రి.. పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ పర్వదినాన్ని హిందువులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇక శివరాత్రి రోజున రోజంతా పచ్చి గంగ కూడా ముట్టకుండా ఉపవాసం ఉంటారు. శివనామస్మరణతో రాత్రంతా జాగరణ చేస్తారు. ఈ సందర్భంగా శివరాత్రి రోజు ఉపవాసం ఉండే వారు తినాల్సిన, తినకూడని ఆహార పదర్ధాలు ఏంటో తెలుసుకుందాం. వారంలో ఒక రోజు ఉపవాసం ఉండటం మంచిదని సాధారణంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఉపవాసం ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతున్నారు. అయితే, ఆరోగ్యస్థాయిని బట్టి ఉపవాసం చేయాలి. అనారోగ్యంతో ఉన్న వాళ్లు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. శరీరాన్ని కష్టపెట్టి ఉపవాసం ఉండటం ఆ పరమేశ్వరుడికి సైతం నచ్చదని పండితులు చెబుతున్నారు. ఉపవాసం తర్వాత మొదట పండ్లు, నానబెట్టిన గింజలు లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీరు వంటివి తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉన్న వారు పాలు, అరటిపండ్లు, ఆపిల్స్‌, బొప్పాయి, కొబ్బరి, దానిమ్మ, చిరుధాన్యాలు మొదలైన ఆహార పదార్థాలు తీసుకోవచ్చు. ఆహారంలో ఫైబర్‌, ప్రొటీన్‌లు ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్‌ తీసుకుంటే మంచిది. ఇక శివుడికి సమర్పించినవి ఏవి కూడా వీరు తినకూడదంట. అలాగే, టీ, కాఫీలు కూడా తాగకూడదు. గోధుమ రొట్టె, బియ్యం వంటి ధాన్యాలు, పప్పు, చిక్కుళ్లు, ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహార ఆహారాలు, వంటివి ఉపవాసం చేసే వారు అస్సలే తినకూడదు. ఉదయం స్నానం చేసిన తర్వాత పూజ ముగించుకుని ఉపవాస దీక్షను విరమించాలి.

Related posts