Praja Kshetram
పాలిటిక్స్

సొంత గూటికి శంకర్‌ పల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి

సొంత గూటికి శంకర్‌ పల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి

 

శంకర్‌ పల్లి మార్చి 01(ప్రజాక్షేత్రం):శంకర్‌పల్లి మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ బిసొల్ల శ్రీధర్ శనివారం తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ పార్టీ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్ లకు పార్టీ కలువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ మధుసూదన చారి, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, మండల పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, నాయకులు రఘు, మండల, మున్సిపల్ నాయకులు పాల్గొన్నారు.

Related posts