తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ ..
హైదరాబాద్ మార్చి 01(ప్రజాక్షేత్రం):ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బిగ్ షాకిచ్చింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణ షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. అయితే, ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి పేరట ఉత్తర్వులు వెలువడ్డాయి.