బీసీ సమాజమంతా తీన్మార్ మల్లన్న వెంబడే
మహబూబ్ నగర్ మార్చి 02(ప్రజాక్షేత్రం):బీసీ సమాజమంతా తీన్మార్ మల్లన్న వెంబడే ఉంటుందని బీసీ జాక్ సమన్వయ కర్త వట్టే జానయ్య అన్నారు. ఆదివారం స్థానిక టిఎన్జీఓల సంఘ భవనంలో జరిగిన బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీసీలకు రావాల్సిన వాటా కొరకు ఆత్మగౌరవ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు మాట్లాడుతూ.. 2028 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని సీట్లలో బీసీ అభ్యర్థులే గెలుస్తారని జోస్యం చెప్పారు. సూర్యపేట బీసీ నాయకుడు అర్జున్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓదెలు యాదయ్య మాట్లాడుతూ..ఈ నెల 9 న స్థానిక క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగే రాజకీయ సదస్సు కు తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా పాల్గొంటారని, పార్టీలకతీతంగా బీసీ లు అందరూ చైతన్యంతో విచ్చేసి మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్,తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి ముదిరాజ్,బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు మైత్రి, యాదయ్య, మహేందర్, శేఖరాచారి, సత్యం,ఎం.ప్రభాకర్,మేధావులు,తదితర కుల సంఘాలు భారీగా పాల్గొన్నారు.