Praja Kshetram
తెలంగాణ

చిన్ననాటి స్నేహితులతో సీఎం రేవంత్ రెడ్డి

చిన్ననాటి స్నేహితులతో సీఎం రేవంత్ రెడ్డి

 

మహబూబ్ నగర్ మార్చి 02(ప్రజాక్షేత్రం):జీవితంలో ఎన్నెన్నో బంధాలు.. అనుబంధాలు.. కానీ స్నేహ బంధానికి.. ప్రత్యేకించి చిన్ననాటి స్నేహ బంధాలు.. ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాలు…. సాధారణ జీవితాలు గడుపుతున్న వారికైనా.. ముఖ్యమంత్రులకైనా.. ప్రధాన మంత్రులు అయిన.. ఆ స్నేహపు సంతకాలు కడదాక నిలుస్తాయి..ఆ స్నేహ బంధాలకు ఎవరు మినహాయింపు కాదు.. ఈ వ్యాఖ్యానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు మినహాయింపు కాదు అని నిరూపించారు. ఆదివారం తనకు అప్పట్లో చదువు చెప్పిన గురువులు.. పాఠశాల , కళాశాల పూర్వ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేయాలని పర్యటనకు ముందే ముఖ్యమంత్రి సమాచారం పంపడంతో.. ఎమ్మెల్యే మెగా రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అందుకు ఏర్పాట్లు పూర్తి చేయించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు ముగించుకున్న అనంతరం నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు చిన్ననాడు చదువులు చెప్పిన గురువులు, మిత్రులను కలిసేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. తాము అలనాడు చదువు చెప్పిన శిష్యుడు.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి.. తమను కలవడానికి రావడం పట్ల గురువులు ఆనందంగాను.. రేవంత్ రెడ్డి మిత్రులు అందరూ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ… స్వాగతాలు పలికారు. గురువుల ఆశీర్వాదాలు తీసుకున్న అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ ఆత్మీయంగా పలకరించి కరచాలనం చేశారు. తమ గురువులను ప్రత్యేకంగా పలకరించి వారితో ఫోటోలు దిగారు. అనంతరం తన చిన్ననాటి మిత్రులతో గడిపిన రోజులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుకు తెచ్చుకున్నారు. తరువాత తమ తమ స్నేహితులతో కలిసి.. ఆనందంగా భోజనాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, మధుసూదన్ రెడ్డి, రాజేష్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts