విగ్రహావిష్కరణకు నోచుకోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం..!
– గత కొన్ని సంవత్సరాల నుండి వృధాగా దర్శనమిస్తున్న వైనం.
– శిథిలావస్థకు చేరకముందే ఆవిష్కరించాలని పలువురి ఆకాంక్ష.
బంట్వారం మార్చి 4 (ప్రజాక్షేత్రం):బంట్వారం మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలుగా, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ చేయకపోవడంతొ పలువురు,ప్రజా సంఘాలు, మండిపడుతున్నారు.బాబు జగ్జీవన్ రామ్ మన దేశానికి ఎంతో కృషి చేశారు, స్వాతంత్ర్య సమరయోధుడిగా, రాజ్యాంగ సభ సభ్యుడిగా మరియు మొదటి మంత్రివర్గంలో సభ్యుడిగా మరియు ఉప ప్రధానమంత్రిగా. ఆయన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడు. కాబట్టి ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంత గొప్ప మానియునికి ఇలాంటి దుస్థితి పట్టడం మన దేశానికె సిగ్గుచేటు అన్ని భావిస్తున్నారు. వచ్చేనెల ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు అయినా ప్రజా ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు స్పందించి, చొరవ తీసుకొని విగ్రహావిష్కరణ చేయాలని పలువురు కోరుతున్నారు.