Praja Kshetram
తెలంగాణ

గురుకులాల విద్యా వ్యవస్థ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

గురుకులాల విద్యా వ్యవస్థ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

 

– విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.

– వంటశాల, విద్యార్థులు వాడే బాత్ రూమ్ లను పరిశీలన.

– జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి.

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మార్చి 04(ప్రజాక్షేత్రం):విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత గురుకుల పాఠశాల ఉపాధ్యాయులదేనని జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి అన్నారు. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని కమ్మదనం సాంఘిక సంక్షేమ గురుకుల పాటశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ కు పుష్పగుచ్చం ఇచ్చి ప్రిన్సిపాల్ విద్యులత స్వాగతం పలికారు. వంటశాల, విద్యార్థులు వాడే బాత్ రూమ్ లను పరిశీలించారు. వంటలు చేసే పరిసరాలు పరిశుభ్రంగా ఉండడంతో మెస్ ఇన్చార్జి శివజ్యోతిని కలెక్టర్ ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులను ప్రిన్సిపాల్ ను అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గురుకులాల విద్యా వ్యవస్థ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని, కాబట్టి ఎలాంటి లోటుపాట్లు లేకుండా విద్యార్థులకు కావలసిన అవసరాలను తీర్చాలని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతోపాటు నాణ్యమైన విద్యను అందించాలని అన్నారు. ఈ పాఠశాలలో ఎంతో మంది విద్యార్థులు ఇప్పటికే గొప్ప ప్రయోజకులుగా తీర్చిదిద్దబడ్డారని ఇక మీదట కూడా అదేవిధంగా విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి రిజల్ట్ వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని వివరించారు. ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచి విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం తోడ్పాటు ను అందిస్తుందని అన్నారు. విద్యార్థులకు పెట్టే భోజనంలో నాణ్యతను పాటించాలని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పెట్టినప్పుడే వారు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Related posts