Praja Kshetram
తెలంగాణ

పసి బాలుడి వేదనకు స్పందించిన పోలీసు హృదయం.

పసి బాలుడి వేదనకు స్పందించిన పోలీసు హృదయం.

 

– సవతి తల్లి వేధింపులతో పోలీసులను ఆశ్రయించిన బాలుడు.

వనపర్తి ప్రతినిధి మార్చి 05(ప్రజాక్షేత్రం):ఓ పసి బాలుడి వేదనను పోలీసు హృదయం ప్రేమతో ఆదరించి అక్కున చేర్చుకున్న ఘటన వనపర్తి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.‌ సవతి తల్లి పెట్టే బాధలను మనసు నుండి బయటికి రానీయకుండా భరిస్తున్న ఒక బాలుడిని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ చేరదీసి అతని భద్రతకు భరోసా కల్పించారు. వివరాలలోకి వెళితే…. పెబ్బేరు మండలం సూగూరు గ్రామానికి చెందిన గొల్ల నరసింహ వనితలకు 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. బాలుడి తల్లి వనిత అనారోగ్యంతో రెండేళ్ల కిందట మరణించగా పెద్దల బలవంతంపై నరసింహకు సమీప బంధువైన లక్ష్మిని రెండవ పెళ్ళి చేశారు. పెళ్ళైన కొత్తలో లక్ష్మి బాలుడిని బాగానే చూసుకునేది. కాలం గడిచేకొద్దీ కక్ష సాదింపుకు పాల్పడడం ప్రారంభించి చీటికీ మాటికి ఎవరూ లేని సమయంలో శారీరకంగా చిత్ర హింసలకు గుర్తుచేస్తూ నరకం చూపడం మొదలు పెట్టింది. ఏదో ఒక సాకుతో చిన్న విషయానికి చాటు మాటుగా తిట్టడం కొట్టడం అతని సవతి తల్లి శారీరకంగా హింస పెడుతూ అతనికి నిప్పులో కాల్చిన సలాకితో అతని తొడలకు తొడలకు పెట్టింది. ఆ విషయం ఆ బాలుడు తండ్రికి చెప్పినా ఆమె అరాచకానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. మంగళవారం బాలుడిని అకారణంగా ఆమె చితకబాధగా ఆ విషయాన్ని ఆ అబ్బాయి తన మేనమామ రామచంద్రయ్యకు ఫోన్ ద్వారా తెలిపాడు. రామచంద్రయ్య బాలుడిని తీసుకొని జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాడు.ఆ అబ్బాయికి సంబంధించిన వృత్తాంతమంతా రామచంద్రయ్య ఎస్పీ రావుల గిరిధర్ కు వివరించాడు. దెబ్బలను గుర్తుకు తెచ్చుకుని ఏడుస్తున్న బాలున్ని ఎస్పీ చేరదీసి అల్పాహారాన్ని అందజేసి ఊరడించారు. అనంతరం ఎస్పీ తనతో పాటు నివాసగృహానికి తీసుకెళ్లి భోజనం చేయించి కొద్దిసేపైనా తర్వాత అతని ద్వారా జరిగిన సమాచారమంతా రాబట్టారు. సవతి తల్లి పెడుతున్న బాధలను, ఆ పసి హృదయం భరించిన తీరును విన్న ఆయన చలించి పోయారు. వెంటనే ఆ అబ్బాయిని జిల్లా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధికారి, బాలల పరిరక్షణ అధికారి, భరోసా కేంద్రం కోఆర్డినేటర్ల ద్వారా బాలుడు ఎదుర్కొన్న మనోవేదనను, చిత్రహింసల వివరాలను సేకరించాలని వారికి సూచించారు. వారి నివేదిక ఆధారంగా నిందితురాలిపై పెబ్బేరు పోలీస్టేషన్లో కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలుడు భయం వీడేందుకు చైతన్యం తీసుకువచ్చి జిల్లాలోని ఏదేని పాఠశాలలో చేర్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

Related posts