టిటిడి చైర్మన్ ఫోటోలు వాట్సప్ లో డిపి గా పెట్టుకొని,శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న మోసగాడు అరెస్టు
తిరుమల,మార్చి 06(ప్రజాక్షేత్రం):టిటిడి చైర్మన్ ఫోటోలు వాట్సప్ లో డిపి గా పెట్టుకొని,చైర్మన్ పి ఆర్ ఓ అని నమ్మిస్తూ శ్రీవారి భక్తులకు సేవా టికెట్లు, ర్శన టికెట్స్ తీసిస్తానని మోసం చేస్తున్న ఫరూక్ అలియాస్ ప్రసాద్ ను ఈ రోజు తిరుమల టూ టౌన్ సి ఆర్ నెంబర్:18/25 యు/ఎస్ 318(4),319(2),66D ఐటి యాక్ట్ కేసులో అరెస్టు చేశారు.
అక్యూజుడ్ డీటెయిల్స్ అండ్ కేస్ ఫ్యాక్ట్స్:ముద్దాయి ఫరూక్ అలియాస్ ప్రసాద్ వయసు 35 సంవత్సరాలు,చంద్రగిరి నివాసి ప్రస్తుతం నెల్లూరు జిల్లా కొవ్వూరు లో వుంటూన్నాడు. గత 4 నెలల నుండి ” తిరుమల సమాచారం ” అనే వాట్సాప్ గ్రూపులు లను క్రియేట్ చేసి అందులో సుమారు 600 మెంబర్స్ ను చేర్చి తిరుమల లో శ్రీవారి దర్శనం కావాలంటే నన్ను సంప్రదించండి అని రాసి పోస్ట్ చేసే వాడు.తను టీటీడీ చైర్మన్ కి పి ఆర్ ఓ అని చెప్పుకొంటూ తిరుమల దర్శన టిక్కెట్స్ సమాచారాన్ని గ్రూప్ లో పోస్ట్ చేసేవాడు.
దానిని నమ్మిన గ్రూప్ లో ని భక్తులు అతన్ని వాట్సాప్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు, అప్పుడు సదరు ముద్దాయి డిమాండ్ ను బట్టి వారి కి బ్రేక్ దర్శనం చేయిస్తాను అని ఆశ చూపి ఫోన్ పే ద్వారా డబ్బు తీసుకొనేవాడు.తదుపరి భక్తులు టికెట్ గురించి అడిగితే ఎటువంటి సమాధానం ఉండదు.వారి నంబర్ ను బ్లాక్ చేస్తాడు.
ఈ విదంగా ఇతడు చాలామంది దగ్గర నుండి సుమారు 80,000/- రూపాయులను తీసుకుని మోసం చేసినాడు.ఈ వ్యవహారాల నిమిత్తం ఇతను 2 బ్యాంకు అకౌంట్ లను వాడాడు.ఇందులో ఒకటి వేరే వ్యక్తులది.ఎవ్వరి కి అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశం తో వేరే వారి బ్యాంక్ అకౌంట్ ను వాడినాడు.అదేవిధంగా ఈ చీటింగ్ కార్యక్రమాల కోసం గాను అతను సుమారు 6 సిమ్ కార్డులను ను ఉపయోగించాడు.
*ముద్దాయి గత చరిత్ర :*
పని పాట లేకుండా తిరుగుతూ విలాసాలకు అలవాటు పడి, స్వగ్రామం అయినటువంటి చంద్రగిరి లో అప్పులు ఎక్కువ కావడం అవి తిరిగి కట్టలేక ఒత్తిడి పెరగడంతో మూడు సంవత్సరాలనుండి నెల్లూరు జిల్లా కొవ్వూరు లో అత్తగారి ఇంటి దగ్గర ఉంటూ అక్కడ కూడా ఈజీ మనీ కి అలవాటు పడి ఈ విధమైన నేరాలు మొదలు పెట్టాడు.
ఇతని పైన గతం లో వున్న కేసు వివరాలు:
1) సి ఆర్ నెంబర్ 39/2010 యు/ఎస్ 379 ఐపిసి ఆఫ్ చంద్రగిరి పిఎస్
2) సి ఆర్ నెంబర్ 40/2010 యు/ఎస్ 379 ఐపిసి ఆఫ్ చంద్రగిరి పిఎస్
3) సి ఆర్ నెంబర్ 42/2010 యు/ఎస్ 379 ఐపిసి ఆఫ్ చంద్రగిరి పిఎస్
పైన తెలిపిన కేసు లో 3 నెలలు జైలు శిక్ష అనుభవించడం జరిగింది.
*అరెస్టు వివరాలు:*
దర్యాప్తులో భాగముగా ఇతని వద్ద నుండి….1.సెల్ ఫోన్, 2 సిమ్ కార్డులు,బ్యాంక్ పాసుబుక్కులు లను స్వాధీనం చేసుకొని ఈ దినము అరెస్టు చేసి జుడీష్యల్ రిమాండ్ కు తరలించడం జరిగింది.
*పోలీసు వారి సూచన:*
ఎట్టి పరిస్థితులలో ఇలాంటి మోసపూరిత ప్రకటనలను, ఇలాంటి దళారులను నమ్మి మోసపోకండి.దర్శనానికి సంబంధించి మీకు ఏవైనా అనుమానాలు ఉంటే…!
-టీటీడీ టోల్ ఫ్రీ నంబర్ 155257 ను కానీ అధికారిక వెబ్ సైట్ ttddevasthanams.ap.gov.in – tirumala.org ను సందర్శించండి.మీరు నకిలీ దళారీల బారినపడి బాధితులుగా ఉంటే వెంటనే తిరుమల పోలీసు వారిని తగు సమాచారం ( 1)దళారీల ఫోన్ నంబరు 2)ఫోన్ పే లేదా గూగుల్ పే ట్రాన్సాక్షన్ ఐడి లు 3) స్క్రీన్ షాట్ లు 4)వాట్స్ అప్ సమాచార స్క్రీన్ షాట్ లు… ఇతరములు తో సంప్రదించి తగు న్యాయం పొందండి.
తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ :0877 2289027, తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్.:0877 2289031