చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం పార్టీ కోసం సైనికుడిలా పనిచేస్తా
– ఎమ్మెల్సీ లేదా ఏదైనా కార్పొరేషన్ లో పదవి కోసం ఆశిస్తున్నా
– తనకు పదవి ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీతోనే ప్రయాణం
– మా కుటుంబంతో చంద్రబాబు నాయుడు కి మంచి అనుబంధం
– తెలుగు దేశం పార్టీ సభ్యుడు మరియు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
శ్రీకాకుళం, మార్చి 07(ప్రజాక్షేత్రం):తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోనే నా ఊపిరి ఉన్నంతవరకు ప్రయాణం కొనసాగుతుందని.. అవసరమైతే తన ప్రాణాలను కూడా తృణ ప్రాయంగా అర్పిస్తానని తెలుగు దేశం పార్టీ సభ్యుడు మరియు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ వ్యాఖ్యానించారు.శుక్రవారం ఉదయం అరసవిల్లిలో సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు.ఆయనకు ఆలయ వర్గాలు సాదరంగా స్వాగతం పలికి… ప్రత్యేక పూజలు చేసి,తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.అనేక సంవత్సరాల నుంచి ప్రజల శ్రేయస్సు కోసం సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తున్న తనకు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ టికెట్ కేటాయించాలని లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ లో స్థానం కల్పించాలని ఆశిస్తున్నానన్నారు.ఒకవేళ ఏ పదవి కేటాయించకపోయినప్పటికీ .. చంద్రబాబు నాయుడు, తెలుగు దేశం పార్టీ కోసం ఎంతటి త్యాగానికైనా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గత వైసిపి అరాచక పాలనను ఎండగడుతూ చేసిన పోరాటాలే చంద్రబాబు నాయుడు పై తెలుగు దేశం పార్టీపై తనకున్న నిబద్ధతకు ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు.మరోవైపు ఎటువంటి కేసులు లేకుండా గత వైసిపి ప్రభుత్వాన్ని గడగడలాడించిన ఘనత తనకు మాత్రమే దక్కుతుందన్నారు.తెలుగు శక్తి అధ్యక్షుడి హోదాలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేశానన్నారు.ఇదిలా ఉండగా తన కుటుంబంతోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంచి అనుబంధ ఉందని ప్రస్తావించారు.తన కుమార్తె ధన్వి రెండో పుట్టినరోజు వేడుకకు చంద్రబాబు నాయుడు స్వయంగా అక్షింతలు వేసి ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు.ఏది ఏమైనప్పటికీ మాతృ దేశ రక్షణకు సైనికుడు ఏ విధంగా పనిచేస్తాడో అదేవిధంగా తాను కూడా చంద్రబాబు నాయుడు కోసం తెలుగుదేశం పార్టీ కోసం సైనికుడి మాదిరిగా పని చేస్తున్నానని పేర్కొన్నారు.
– జగన్ పైన ఒక భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చత్రపతి శివాజీ లాగా దండయాత్ర.
తెలుగు దేశం పార్టీ నాయకులు బోడేపూడి దొరబాబు మాట్లాడుతూ పార్టీ కష్ట కాలంలో ఉత్తరాంధ్ర మరియు రాష్ట్ర నలుమూలా పర్యటించి పార్టీ కోసం ఆయన బి.వి.రామ ఎంతో కృషి చేశారు. జగన్ పైన ఒక భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చత్రపతి శివాజీ లాగా దండయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా బి.వి.రామ గుర్తించి ప్రజలకు సేవ చేసేందుకు ఎమ్మెల్సీ లేదా రాష్ట్ర కార్పరేషన్ చైర్మన్ పదవి ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమంలో నాగరాజు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.