Praja Kshetram
పాలిటిక్స్

రాములమ్మకు భలే ఛాన్స్..

రాములమ్మకు భలే ఛాన్స్..

 

కాంగ్రెస్ ఎమ్మెల్సీలు వీళ్లే..

హైదరబాద్, మార్చి 09(ప్రజాక్షేత్రం):బ్యూరో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఏఐసీసీ ప్రకటించింది. ముఖ్యంగా విజయశాంతి పేరును ఖరారు చేయడం ఆసక్తికరంగా మారింది. విజయశాంతి పేరు పరిగణనలో ఉన్నట్టు ఇప్పటివరకు వార్తలు కూడా రాలేదు. ఊహించని పేరు తెర పైకి రావడంతో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. సోమవారం మధ్యాహ్నం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే ఒక సీటును సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం నిర్ణయించుకుంది.

Related posts