Praja Kshetram
తెలంగాణ

మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేసిన టిఆర్టిఎఫ్ ప్రధాన కార్యదర్శి జామ కుశాల్

మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేసిన టిఆర్టిఎఫ్ ప్రధాన కార్యదర్శి జామ కుశాల్

 

 

చౌదరి గూడెం మార్చి 10(ప్రజాక్షేత్రం):జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌదరి గూడెం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం టి ఆర్ టి ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆదర్శ పాఠశాల చైర్మన్ రాణి ని టీ ఆర్ పి ఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ సన్మానం చేయడం జరిగింది. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కె సునీత మేడం ని అదేవిధంగా పాఠశాల మహిళ ఉపాధ్యాయులు అందరిని సన్మానం చేయడం జరిగింది. ఈ అంతర్జాతీయ మహిళా సందర్భంగా టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుశాల్ మాట్లాడుతూ ఆకాశంలో సగభాగం మహిళ, దేవుడు ప్రకృతిని సృష్టిస్తే మహిళ మానవ జన్మకు సృష్టికర్త భూమి మీద వెలిసిన దేవత ఆత్మీయత, అనురాగం, ప్రేమ అభిమానాలకు, ఓర్పు, సహనానికి ,అనుబంధాలకు ప్రతిరూపమే మహిళా మహిళలు ప్రభుత్వ రంగాలలో రాజకీయ ఆర్థిక అన్ని రంగాలలో సమాన అవకాశాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో రాణించాలి. సృష్టిలో ఆడ మగ సమానమే అందుకే మహిళలని వివక్షత లేకుండా సమానంగా గౌరవించినప్పుడే మహిళలను ఉన్నతంగా చూసినప్పుడే ఆ దేశం ఉన్నతంగా అగ్ర దేశంగా మారుతుంది మహిళా శక్తి ఎంతో గొప్పది అని అన్నారు. సెలవు లేకుండా శ్రమించే నిరంతర శక్తి ఆమె ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు విద్య వైద్యం వ్యాపారం రాజకీయాలు క్రీడలు నటన టెక్నాలజీ బ్యాంకింగ్ అంతరిక్షం ఇంటి బాధ్యతలతో సహా అన్ని రంగాలలో రాణిస్తూ మహిళా సాధికారత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు అన్నారు. భారతదేశంలో మొదటి ప్రధాని ఇందిరా గాంధీ భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి మహిళా కల్పన చావ్లా భారతదేశంలో మొత్తం మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వీళ్లంతా గొప్ప మహిళలుగా రాణించారు అని అన్నారు.

Related posts