భూములు కోల్పోతున్న రైతుల ఆత్మహత్యాయత్నం
ఇబ్రహీంపట్నం మార్చి 10(ప్రజాక్షేత్రం):రైతులకు ఎలాంటి సమాచారం, పరిహారం ఇవ్వకుండానే తమ భూముల్లో నుంచి ఫ్యూచర్ సిటీ కోసం 300ఫీట్ రోడ్డుకు కడీలు పాతారంటూ భూములు కోల్పోతున్న బాధిత రైతులు రంగారెడ్డి కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు రావిర్యాల రైతులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ధీంతో అక్కడే ఉన్న పోలీసులు, ఆత్మహత్య చేసుకోబోతున్న రైతులను అడ్డుకున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుండి కందుకూరు మండలం బేగారి కంచ ఫ్యూచర్ సిటీ వరకు 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డును ప్రభుత్వం నూతనంగా నిర్మించనుంది. అందుకు మొత్తం 449.27 ఎకరాలను ప్రభుత్వం రైతుల నుండి సేకరించనుంది. ఆ దిశగా ప్రభుత్వం వేగంగా పనులు చేస్తోంది. గ్రామాల వారిగా రైతులు, వారు కోల్పోతున్న భూముల వివరాలను వెల్లడించింది. ఆ భూముల్లో ప్రస్తుతం 300 ఫీట్ల రోడ్డుకు హద్దులను ఏర్పాటు చేస్తున్నారు. ధీంతో ఆ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా, ఎంత ఇస్తామని కూడా చెప్పకుండానే తమ భూముల్లో కడీలను పాతడంతో మహేశ్వరం మండలం కొంగర కుర్దూ రెవెన్యూ గ్రామానికి చెందిన రైతులు సర్వేనెంబర్ 13 గల రైతుల పట్టా భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్న భూమిలో ఇటీవల సర్వే నెంబర్ ప్రకారం.13 లో మొత్తం భూములు పోతున్నాయని కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు ఆత్మహత్యాయత్నం చేశారు. ధీంతో అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు.